News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 24th October 2018
Markets_main1540353899.png-21413

  • సెన్సెక్స్‌ 350 పాయింట్లకి పైగా అప్‌
  • మళ్లీ 34,000 మార్క్‌ పైకి రికవరీ
  • 130 పాయింట్లకుపైగా లాభపడిన నిఫ్టీ
  • 10,250 మార్క్‌ పైకి బౌన్స్‌బ్యాక్‌

మంగళవారం నష్టాల్లో ముగిసిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 33,847 పాయింట్లతో పోలిస్తే 356 పాయింట్ల లాభంతో 34,203 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,146 పాయింట్లతో పోలిస్తే 132 పాయింట్ల లాభంతో 10,278 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. 

అమ్మకాల ఒత్తిడికి తోడు ఎర్నింగ్స్‌ అంచనాలపై ఏర్పడ్డ ఆందోళనలు ప్రతికూల ప్రభావం చూపడం సహా అమెరికా మధ్యంతర ఎన్నికలు/ ఇటలీ బడ్జెట్‌ భయాలు వంటి అంశాలు ఇన్వెస్టెర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయంతో అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగియడం,  అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌కు ఏర్పడే డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేస్తామని సౌదీ అరేబియా ‍ప్రకటంచడంతో క్రూడ్‌ ధరలు బుధవారం తగ్గడం, రిజర్వు బ్యాంక్‌.. మార్కెట్‌లో మరింత లిక్విడిటీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అక్టోబర్‌ 25న దాదాపు రూ.12,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుండటం, ఎన్‌ఎస్‌ఈ.. కాపర్‌ లార్జ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను ప్రారంభించేందుకు సెబీ ఆమోదం పొందటం, రూపాయి మంగళవారం స్థిరంగానే ఉంటూ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఒక పైసా నష్టంతో 73.57 వద్ద ముగియడం, ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్‌మెంట్లు జనవరి- సెప్టెంబర్‌ మధ్యకాలంలో రూ.14.6 బిలియన్‌ డాలర్లకు తగ్గడం, ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్యకాలంలో రూ.274 కోట్లు నిధులను ఉపసంహరించుకోవడం, ఆర్‌బీఐ దాదాపు 31 ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్స్‌లను రద్దు చేయడం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సహా దాదాపు 48 కంపెనీలు బుధవారం క్యూ2 ఫలితాలను ప్రకటించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

ఇక నిఫ్టీ-50లో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, హిందాల్కో, ఐఓసీ, అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, టీసీఎస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 6 శాతానికి పైగా, ఇండియాబుల్స్ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4 శాతానికిపైగా లాభపడ్డాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ గరిష్టంగా 2 శాతానికిపైగా పెరిగింది. ఇక నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ ఆటో, నిప్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా లాభపడ్డాయి. 



You may be interested

రూపీ అప్‌

Wednesday 24th October 2018

40 పైసలు లాభంతో 73.17 వద్ద ప్రారంభం కలిసొచ్చిన బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గుదల, క్రూడ్‌ ధరల క్షీణత ఇండియన్‌ రూపాయి బుధవారం బాగా లాభపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 40 పైసలు లాభంతో 73.17 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు దిగిరావడం.. బ్యాంకులు.. ఎగుమతిదారులు డాలర్లను ఎక్కువగా విక్రయించడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. రూపాయి మంగళవారం దాదాపు ఫ్లాట్‌గానే 73.57 వద్ద ముగిసింది.  క్రూడ్‌ ధరలు దిగిరావడం వల్ల

మార్కెట్‌ ఎటు వైపు?

Wednesday 24th October 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ► అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నికాయ్‌, తైవాన్‌, షాంఘై మినహా మిగతావన్నీ లాభాల్లో ఉన్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 27 పాయింట్ల నష్టంతో 21,983 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 8 పాయింట్ల లాభంతో 3,039 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 68 పాయిం‍ట్ల నష్టంతో 9,706 పాయింట్ల

Most from this category