STOCKS

News


లాభాల బోణి

Wednesday 10th October 2018
Markets_main1539143766.png-20990

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,299 పాయింట్లతో పోలిస్తే 194 పాయింట్ల లాభంతో 34,493 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,301 పాయింట్లతో పోలిస్తే 30 పాయింట్ల లాభంతో 10,331 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  

అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం, నవంబర్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఉత్తర కొరియా అధినేత కిమ్‌తో మరోమారు భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలియజేయడం, కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌లోకి విదేశీ సంస్థలు అడుగు పెట్టేందుకు సెబీ అనుమతినివ్వడం, రూపాయి మంగళవారం రికార్డ్‌ కనిష్ట స్థాయికి పడిపోయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 33 పైసలు క్షీణతతో 74.39 వద్ద ముగియడం, క్రూడ్‌ ధరలు బుధవారం తగ్గడం, లిక్విడిటీ సమస్య పరిష్కారంలో భాగంగా ఆర్‌బీఐ అక్టోబర్‌ 11న  రూ.12,000 కోట్ల విలువైన గవర్నమెంట్‌ బాండ్లను కొనుగోలు చేయనుండటం, దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ2 ఎర్నింగ్స్‌ ఫలితాలను అక్టోబర్‌ 11న వెల్లడించనుండటం, చైనాపై ఆధారపడ్డటాన్ని తగ్గించుకునేందుకు దేశంలోనే ఏపీఐ తయారీని పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటొకార్ప్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, వేదాంత, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, ఏసియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోల్‌ ఇండియా, ఐఓసీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. అయితే ఒక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ మాత్రమే నష్టాల్లో ఉంది.



You may be interested

రూపీ రికవరీ

Wednesday 10th October 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం స్వల్పంగా కోలుకుంది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.22 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ముగింపు 74.39తో పోలిస్తే 0.22 శాతం లాభపడింది. రూపాయి బుధవారం 74.13 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 8.049 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 8.076 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. ప్రస్తుత ఏడాది

మార్కెట్‌ ఎటు?

Wednesday 10th October 2018

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 56 పాయిం‍ట్ల నష్టంతో 26,430 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 4 పాయింట్ల నష్టంతో 2,880 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 7,738 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన

Most from this category