STOCKS

News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 17th September 2018
Markets_main1537157317.png-20302

  • 11,500 దిగువన నిఫ్టీ
  • 38,000 మార్క్‌ కిందకు సెన్సెక్స్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,090 పాయింట్లతో పోలిస్తే 63 పాయింట్ల నష్టంతో 38,027 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,515 పాయింట్లతో పోలిస్తే 51 పాయింట్ల నష్టంతో 11,464 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సమయం పెరిగే కొద్ది ఇండెక్స్‌ల నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:30 సమయంలో నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 11,432 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 260 పాయింట్ల నష్టంతో 37,831 వద్ద ట్రేడవుతున్నాయి. 
అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగియడం, ఒక్క జపాన్‌ మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతుండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనా  నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే 200 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రొడక్టులపై సోమవారం నుంచి టారిఫ్‌లు విధిస్తారనే అంచనాలు, 3.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలియజేయడం, క్రూడ్‌ ధరలు సోమవారం తగ్గడం, 2020లో ఆర్థిక సంక్షోభం రావొచ్చని జేపీ మోర్గాన్‌ అంచనా వేయడం, విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి రూ.9,400 కోట్లు వెనక్కు తీసుకోవడం, ఆర్‌బీఐ రూ.10,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుండటం, ఫారెక్స్‌ నిల్వలు సెప్టెంబర్‌ 7తో ముగిసిన వారంలో 819 మిలియన్‌ డాలర్ల తగ్గుదలతో 399.28 బిలియన్‌ డాలర్లకు క్షీణించడం, రూపాయి శుక్రవారం 34 పైసలు బలపడి 71.84 వద్ద ముగియడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, ఐషర్‌ మోటార్స్‌, సన్‌ ఫార్మా, సిప్లా, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక టైటాన్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందుస్తాన్‌ పెట్రోలియం షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా మినహా మిగతావన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. 



You may be interested

రూపీ పతనం ఆగట్లే..

Monday 17th September 2018

1 శాతానికిపైగా క్షీణత ప్రధాని మోదీతో దేశ ఆర్థిక అంశాలపై చర్చించిన తర్వాత రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన పలు చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం మళ్లీ క్షీణించింది. వర్ధమాన మార్కెట్ల కరెన్సీలు కూడా పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

మార్కెట్‌ పయనం ఎటు?

Monday 17th September 2018

శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన నిఫ్టీ తర్వాత అదే జోరు కొనసాగించింది. 11,500 మార్క్‌ పైకి వెళ్లింది. డైలీ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్స్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను, వీక్లి చార్ట్స్‌లో హ్యామర్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. నిఫ్టీ ఇండెక్స్‌ 145 పాయింట్ల లాభంతో (1.28 శాతం) 11,515 వద్ద ముగిసింది. అయితే వారం పరంగా చూస్తే 0.6 శాతంమేర క్షీణించింది.  ఇండియా వీఐఎక్స్‌ 3.24 శాతం తగ్గుదలతో 13.78కి క్షీణించింది. ఈ తగ్గుదల మార్కెట్‌లో కొంత స్థిరత్వాన్ని

Most from this category