STOCKS

News


నష్టాలతో ఆరంభం..

Thursday 25th October 2018
Markets_main1540440335.png-21455

  • సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా పతనం
  • 33,800 మార్క్‌ దిగువున ప్రారంభం
  • నిఫ్టీ 90 పాయింట్లు డౌన్‌
  • 10,250 దిగువున ఇండెక్స్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,033 పాయింట్లతో పోలిస్తే 255 పాయింట్ల నష్టంతో 33,778 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,225 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల నష్టంతో 10,135 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 

గృహ విక్రయాలు బలహీనంగా ఉండటం సహా చిప్‌ తయారీ కంపెనీల భవిష్యత్‌ వృద్ధి అంచనాలు నిరుత్సాహకరంగా ఉండటం వల్ల ఆర్థిక వృద్ధి, లాభాల పెరుగుదలపై ఆందోళలు తలెత్తడంతో అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగియడం, అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాలతో ట్రేడవుతుండటం, గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి చోటుచేసుకోవడం సహా అమెరికా మార్కెట్లు భారీగా పతనం కావడం వల్ల క్రూడ్‌ ధరలు గురువారం 1 శాతంమేర తగ్గడం, యూజర్లకు గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా మార్కెట్‌ సమాచారాన్ని అందించేందుకు బీఎస్‌ఈ.. గూగుల్‌తో జతకట్టడం, ఎగుమతులను పెంచుకోవడం లక్ష్యంగా భారత్‌.. చైనాతో వాణిజ్య చర్చలు జరపాలని భావిస్తుండటం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 41 పైసలు బలపడి 73.16 వద్ద ముగియడం, కార్పొరేట్స్‌ జారీ చేసే ఆన్‌-ట్యాప్‌ బాండ్లకి సంబంధించి అతిత్వరలో మార్గదర్శకాలను ప్రకటిస్తామని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తెలియజేయడం, దాదాపు 78 కంపెనీలు గురువారం క్యూ2 ఎర్నింగ్స్‌ ఫలితాలను వెల్లడించనుండటం, విప్రో నికర లాభం క్యూ2లో 10 శాతంమేర క్షీణించడం, ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకులను చక్కదిద్దడానికి ఉద్దేశించిన ‘దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలియజేయడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీ-50లో ఐఓసీ, విప్రో, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హిందాల్కో, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, వేదాంత, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఇండియాబుల్స్ హౌసింగ్‌ ఫైనాన్స్‌ దాదాపు 5 శాతం పతనమైంది. భారతీ ఎయిర్‌టెల్‌ 3 శాతానికిపైగా పడిపోయింది. ఐవోసీ, విప్రో షేర్లు 1 శాతానికిపైగా లాభపడ్డాయి.  

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ గరిష్టంగా 1 శాతానికిపైగా పడిపోయింది. ఇక నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌లు దాదాపు 1 శాతంమేర నష్టపోయాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 25th October 2018

ముంబై:- వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌:- ప్రస్తుతం కంపెనీలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్టా‍్య రేటింగ్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌ మిల్స్‌ రేటింగ్‌ను తగ్గించింది. ఇక్రాన్‌ ఇంటర్నేషనల్‌:- తన అనుబంధ సంస్థ ఇక్రాన్‌ ద్వారా రైట్‌ ఇష్యూ పద్దతిలో రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టింది. టాటా కెమికల్స్‌:- వ్యాపార కార్యకలాపాల నిమిత్తం సెంట్రల్‌ ఎలక్ట్రో కెమికల్స్‌ రీసెర్చ్‌

మార్కెట్‌ తగ్గుతుందా? పెరుగుతుందా?

Thursday 25th October 2018

గురువారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..  ♦ అమెరికా మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఏడాది లాభాలన్నీ ఆవిరయ్యాయి. 2011 నుంచి చూస్తే మార్కెట్లు ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.41 శాతం లేదా ఏకంగా 608 పాయిం‍ట్ల నష్టంతో 24,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 3.09 శాతం లేదా 85 పాయింట్ల నష్టంతో 2,656 పాయింట్ల

Most from this category