STOCKS

News


లాభనష్టాల మధ్య దోబూచులాట

Wednesday 29th August 2018
Markets_main1535515810.png-19735

కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతున్న ఇండెక్స్‌లు బుధవారం నెమ్మదించాయి. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,897 పాయింట్లతో పోలిస్తే 93 పాయింట్ల లాభంతో 38,990 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,738 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల లాభంతో 11,745 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే కొద్ది సేపటికే ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:36 సమయంలో నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో ఉంటే, సెన్సెక్స్‌ మాత్రం మళ్లీ 11 పాయింట్ల లాభంలో ఉంది.

ఒక్క చైనా మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ బుధవారం లాభాల్లోనే ట్రేడవుతుండటం, అమెరికా మార్కెట్‌ మంగళవారం స్వల్ప లాభంతో అక్కడక్కడే ముగియడం, ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కెనడా కూడా అమెరికాతో చర్చలు జరపనుండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు రూ.1.02 లక్షల కోట్లుగా ఉండొచ్చని ఇక్రా అంచనా వేయడం, ఇరాన్‌పై ఆంక్షలు సహా పెట్రోలియం ఎగుమతి దేశాల ఆర్గనైజేషన్‌కు వెలుపల ఉన్న దేశాల్లో ఉత్పత్తి పెరగడం వల్ల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు బుధవారం అక్కడక్కడే ఉండటం, కార్పొరేట్‌ రుణ వ్యయాలు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్‌ పేర్కొనడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మంగళవారం 6 పైసలు బలపడి 70.10 వద్ద ముగియడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొన్నారు. 

ఇక నిఫ్టీలో వేదాంత, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, యూపీఎల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, హెచ్‌డీఎఫ్‌షీ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, హీరో మోటొకార్ప్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
సెక్టోరల్‌ ఇండెక్స్‌లు మిశ్రమంగా ఉన్నాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ మినహా మిగతావన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

 You may be interested

పడిపోయిన రూపాయి

Wednesday 29th August 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 22 పైసల నష్టంతో 70.32 వద్ద ప్రారంభమైంది. రూపాయి మునపటి ముగింపు 70.10గా ఉంది. దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణం. అలాగే పలు ఇతర కరెన్సీలతో పోల్చిచూసిన కూడా డాలర్‌ బలపడింది. ఇక అమెరికా డాలర్‌తో ఇండియన్‌ రూపాయి మారవ విలువ బుధవారం 70.05- 70.50 శ్రేణిలో కదలాడవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది.

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 29th August 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు ఇంటెక్‌ క్యాపిటెక్‌:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సంజీవ్‌ గోయెల్‌ తిరిగి నియమితులయ్యారు. ఆర్‌ఎంజీ అల్లో స్టీల్‌:- బోర్డు ఆఫ్‌ ఛైర్మన్‌గా బి.కె. గోయెంకా నియమితులయ్యారు. సైబర్‌స్కేప్‌ మల్టీమీడియా:- మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎస్‌కే ఆనంద్‌ నియమితులయ్యారు. అస్ట్రాన్‌ ఇంజనీరింగ్‌ ఎలక్ట్రానిక్స్‌:-  థైసెన్‌క్రుప్‌ ఇండియా విభాగం నుంచి రూ.15 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. జై ప్రకాష్‌ పవర్‌:- కంపెనీ రుణదాతలకు కంపల్సెరీ కన్వర్టబుల్‌ ఫ్రిఫరెన్స్‌ షేర్ల ద్వారా రూ.4వేల

Most from this category