STOCKS

News


రిలీఫ్‌ ర్యాలీ..

Wednesday 10th October 2018
Markets_main1539151592.png-21010

♦ భారీ లాభాల్లో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు
♦ 10,400పైకి నిఫ్టీ
♦ సెన్సెక్స్‌ 400 పాయింట్లు అప్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ రిలీఫ్‌ ర్యాలీ చేస్తోంది. మార్నింగ్‌ లాభాలతో ప్రారంభమైన ఇండెక్స్‌లు అదే జోరు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. నిఫ్టీ 130 పాయింట్లకు పైగా పెరిగింది. ఉదయం 11:19 సమయంలో సెన్సెక్స్‌ 398 పాయింట్ల లాభంతో 34,697 వద్ద, నిఫ్టీ 133 పాయింట్ల లాభంతో 10,434 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 10,400 మార్క్‌పైకి చేరుకోవడానికి ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ బాగా దోహదపడ్డాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధర తగ్గడం, రూపాయి రికవరీ, లిక్విడిటీ సమస్య పరిష్కారంలో భాగంగా ఆర్‌బీఐ అక్టోబర్‌ 11న రూ.12,000 కోట్ల విలువైన గవర్నమెంట్‌ బాండ్లను కొనుగోలు చేయనుండటం, రూ.45,000 కోట్ల విలువైన ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తులను (రుణ పోర్ట్‌ఫోలియోలను) కొనుగోలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయించడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సుజుకీ ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి హెవీవెయిట్‌ షేర్లు లాభపడటం వల్ల ఇండెక్స్‌లు పెరిగాయని తెలిపారు.  

నిఫ్టీ-50లో బజాజ్‌ ఫైనాన్స్‌ 8 శాతంమేర ఎగసింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 7 శాతంమేర పెరిగింది. టైటాన్‌, మారుతీ, ఐషర్‌ మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, వేదాంత, యూపీఎల్‌ 3-5 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. అదేసమయంలో విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ ఫార్మా షేర్లు 1-2 శాతం శ్రేణిలో నష్టపోయాయి. ఒక్క ఐటీ మినహా మిగతా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ గరిష్టంగా 3 శాతంమేర ఎగసింది. ఇక నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌,  నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 2 శాతానికిపైగా ఎగశాయి. 

కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,299 పాయింట్లతో పోలిస్తే 194 పాయింట్ల లాభంతో 34,493 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,301 పాయింట్లతో పోలిస్తే 30 పాయింట్ల లాభంతో 10,331 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  



You may be interested

మెటల్‌ షేర్ల వెలుగులు

Wednesday 10th October 2018

9శాతం లాభపడి నాల్కో షేరు మెటల్‌ షేర్లు ర్యాలీ రెండోరోజూ కొనసాగుతోంది. క్రితం ట్రేడింగ్‌లో 1.50శాతం నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2.25శాతం లాభపడింది. ఉదయం గం.11:15నిల.కు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గతముగింపు(3,373.75)తో పోలిస్తే 1.75శాతం పెరిగి 3,433.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి  ఈ సూచీలో భాగమైన 15 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలో అత్యధికంగా నాల్కో 9శాతం లాభపడింది. జేఎస్‌ఎల్‌ హిస్సాఆర్‌ స్టీల్‌

టైమ్‌షేర్‌ ప్రాపర్టీలోకి ‘ఫెర్న్స్‌’ ఎంట్రీ

Wednesday 10th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఫెర్న్స్‌ ఎస్టేట్‌ అండ్‌ డెవలపర్స్‌ లగ్జరీ టైమ్‌షేర్‌ ప్రాపర్టీ విభాగంలోకి ప్రవేశించింది. తొలి దశలో రూ.700 కోట్ల పెట్టుబడులతో కర్నాటకలోని సక్లేశ్‌పూర్‌లో క్లబ్‌ రోసెట్టా పేరుతో టైమ్‌షేర్‌ ప్రాపర్టీని నిర్మించన్నునట్లు జాయింట్‌ ఎండీ అండ్‌ సీఈఓ జై శ్రీధర్‌ మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. 100 ఎకరాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో 100 గదులు, 3 రెస్టారెంట్లు, బాంక్విట్‌

Most from this category