STOCKS

News


సెన్సెక్స్‌ 400 పాయింట్లు క్రాష్‌

Friday 21st December 2018
Markets_main1545371783.png-23135

  • నిఫ్టీ 130 పాయింట్లు డౌన్‌
  • 10,850 దిగువకు ఇండెక్స్

శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన ఇండియన్‌ మార్కెట్‌ తర్వాత వేగంగా పతనమైంది. ఒకానొక సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పడిపోతే, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 11:16 సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ 376 పాయింట్ల నష్టంతో 36,055 వద్ద, నిఫ్టీ 128 పాయింట్ల నష్టంతో 10,823 వద్ద ట్రేడవుతున్నాయి. ఫెడ్‌ రేటు పెంపు వల్ల గురువారం రాత్రి అమెరికా మార్కెట్లు పడిపోవడం, దీని వల్ల శుక్రవారం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండటం వల్ల ఇండియన్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడింది. 

కాగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,951 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో 10,944 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,431 పాయింట్లతో పోలిస్తే 18 పాయింట్ల లాభంతో 36,449 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 

నిఫ్టీ-50లో టాటా మోటార్స్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు మాత్రమే గెయినర్స్‌గా ఉన్నాయి. టాటా మోటార్స్‌ 1 శాతానికి పైగా పెరిగింది. ఇక ఐఓసీ 5 శాతానికి పైగా పతనమైంది. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ 4 శాతానికి పైగా పడిపోయింది. యూపీఎల్‌ 3 శాతానికి పైగా నష్టపోయింది. మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్‌ షేర్లు 2 శాతానికి పైగా క్షీణించాయి. ఏసియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌, గెయిల్‌ షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా క్షీణించాయి.  



You may be interested

5 డాలర్లు తగ్గిన బంగారం..

Friday 21st December 2018

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర  శుక్రవారం తగ్గింది. ఔన్స్‌ బంగారం ధర 5.85 డాలర్ల  క్షీణతతో 1,262.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. పసిడి మునపటి ముగింపు (గురువారం) స్థాయి 1,267.9 డాలర్లుగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం ప్రతికూల ప్రభావం చూపింది. డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముంగింపు 95.72తో పోలిస్తే 0.2 శాతం పెరుగుదలతో 95.91 వద్ద ట్రేడవుతోంది.  దేశీయంగా చూస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగానే దేశీయంగా కూడా బంగారం ధర

సిమెంట్‌ మీద జీఎస్‌టీని తగ్గించాలి

Friday 21st December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశ ఆర్ధికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో సిమెంట్‌ పరిశ్రమ ప్రధాన భాగస్వామి అని ఫస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌సీసీ) తెలియజేసింది. ప్రస్తుతం సిమెంట్‌పై ఉన్న 28 శాతం జీఎస్‌టీని వెంటనే 18 శాతానికి తగ్గించాలనే అభ్యర్థనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని.. త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడుతుందని ఎఫ్‌సీసీ ఫౌండర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ ప్రతాప్‌ పడోడే తెలిపారు. గురువారమిక్కడ ప్రారంభమైన రెండు రోజుల 10వ సిమెంట్‌ ఎక్స్‌పో సందర్భంగా

Most from this category