News


72కు రూపాయి.. మార్కెట్లు యూటర్న్‌

Thursday 6th September 2018
Markets_main1536220458.png-20017

ఇండియన్‌ రూపాయి అడ్డుఅదుపు లేకుండా పతనమౌతూనే ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గురువారం ఏకంగా 72 స్థాయి దిగువకు పడిపోయింది. 72.1 స్థాయిని తాకింది. బుధవారం నాటి ముగింపు స్థాయి 71.76తో పోలిస్తే 34 పైసలు క్షీణించింది. కాగా ఇండియన్‌ రూపాయి గురువారం ఉదయం తన మునపటి ముగింపుతో పోలిస్తే 11 పైసలు బలపడి 71.65 వద్ద ప్రారంభమైంది. అయితే ఈ లాభాలను రూపాయి కొనసాగించలేకపోయింది. మళ్లీ జీవిత కాల కనిష్ట స్థాయికి పతనమైంది.  

రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయిలకు పతనం కావడంతో స్టాక్‌ మార్కెట్లు లాభాల్లోంచి నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన ఇండెక్స్‌లు మధ్యాహ్నాం 1:17 సమయంలో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 37,989 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 11,464 పాయింట్ల వద్ద ట్రేడువుతున్నాయి. 

నిఫ్టీ-50లో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, సిప్లా షేర్లు 2 శాతానికిపైగా పెరిగాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు 1 శాతానికిపైగా లాభపడ్డాయి. ఇక జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు 3 శాతానికిపైగా పడిపోయింది. హిందాల్కో 2 శాతానికిపైగా నష్టపోయింది. ఇక మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ షేరు 1 శాతానికిపైగా పతనమయ్యాయి. 

సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ మినహా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. 



You may be interested

రూపీ పతనంతో పార్మా షేర్ల జోరు

Thursday 6th September 2018

రూపాయి క్షీణతతో మార్కెట్‌ నిలువునా పతనవుతుంటే మరోవైపు ఫార్మా షేర్లు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి 72.10 స్థాయి వద్ద కొత్త కనిష్టాలకు పతనమవడంతో విదేశీ ఎగుమతులపై ఆధారపడే ఫార్మా షేర్లు లాభాలబాట పట్టాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టపోతున్నప్పటి నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ 2శాతం వరకూ ర్యాలీ చేసింది. ఈ సూచీలోని భాగమైన 10 షేర్లు లాభాల్లోనే ట్రేడ్‌

భారీ పతనాలేవీ ఉండవు!!

Thursday 6th September 2018

నిఫ్టీ-50 తన ఆగస్ట్‌ 28 నాటి గరిష్ట స్థాయి 11,760 నుంచి దాదాపు 300 పాయింట్లమేర కరెక‌్షన్‌కు గురైంది. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు అంశాలు కరెంట్‌ అకౌంట్‌ లోటును ప్రభావితం చేస్తాయని బిర్లా సన్‌లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కో-చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలు వెల్లడించారు. మార్కెట్లపై

Most from this category