STOCKS

News


11,350 దిగువకు నిఫ్టీ

Monday 13th August 2018
Markets_main1534134278.png-19196

మార్కెట్‌ నష్టాలు మరింత పెరిగాయి. నిఫ్టీ 11,350 దిగువకు వచ్చేసింది. 80 పాయిట్ల క్షీణతతో 11,349 వద్ద ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్‌ ఏకంగా 267 పాయింట్ల క్షీణతతో 37,602 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 
అమెరికా మార్కెట్లు శుక్రవారం క్షీణించడం, ఆసియా మార్కెట్లు కూడా సోమవారం నష్టాలోనే ట్రేడవుతుండటం, టర్కీ లిరా క్షీణించడంతో యూరో ఏడాది కనిష్ట స్థాయికి పడిపోవడం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం, గ్లోబల్‌ కరెన్సీ భయాల నేపథ్యంలో ఇండియన్‌ రూపాయి భారీగా పతనం కావడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొన్నారు. 
ఆసియా మార్కెట్లు డౌన్‌..
ఆసియా ప్రధాన సూచీలన్నీ భారీ పతన బాటలో ఉన్నాయి. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225.. 404 పాయింట్ల క్షీణతతో 21,894 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 519 పాయింట్ల క్షీణతతో 27,847 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 39 పాయింట్ల క్షీణతతో 2,244 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 41 పాయింట్ల క్షీణతతో 3,244 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 237 పాయిం‍ట్ల క్షీణతతో 10,746 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొజిట్‌ 48 పాయింట్ల నష్టంతో 2,747 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 

ఇక నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, గెయిల్‌, సన్‌ ఫార్మా, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. వేదాంత, ఎస్‌బీఐ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం, టాటా మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఇన్‌ప్రాటెల్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా మినహా మిగతావన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. 
 



You may be interested

పసిడికి డాలర్‌ ఎఫెక్ట్‌

Monday 13th August 2018

ముంబై:- డాలర్‌ పెరుగుదలతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర సోమవారం భారత కాలమానం ప్రకారం గం.10:00 ని.లకు 3.70 డాలర్లు స్వల్ప తగ్గుదలతో 1,215.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. టర్కీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా డాలర్‌ విలువ 13నెలల గరిష్టానికి తాకింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలర్‌ ఇండెక్స్‌ జూలై 2017 తరువాత 96.50

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 13th August 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- ఈ బ్యాంకు డిప్యూటీ ఎం.డీ. ప్రకాష్‌ సుక్తంకర్‌ రాజీనామా చేశారు. అశోక్‌ లేలాండ్‌:- బ్రిటన్‌ తన అనుబంధ సంస్థ ఒప్టరే ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ వాహనాలను తయారుచేసేందుకు ఆర్డర్లను దక్కించుకుంది. ఎన్‌బీసీసీ:- సెంట్రల్‌ బోర్డు ఆప్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌(హెచ్‌బీఎస్‌ఈ) నుంచి రూ.150 కోట్ల విలువైన ఆర్డర్లును దక్కించుకుంది. యూనివర్సల్‌ కేబుల్స్‌:- జర్మని ఆధారిత కేబుల్‌ కంపెనీ ఎన్‌కేటీ సంస్థతో భాగస్వామ్య ఒ‍ప్పందాన్ని

Most from this category