నష్టాల్లోకి జారుకున్న మార్కెట్
By Sakshi

సెన్సెక్స్ 220 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు డౌన్ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్ కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలో 36124 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అరగంటకే 220 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10804 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10710 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 70 పాయింట్లు పడిపోయింది. వ్యవసాయ ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తుందన్న వార్తలు, బడ్జెట్లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తారన్న అంచనాలకు తోడు కార్పొరేట్ల రుణ సంక్షోభం నేపథ్యంలో బ్యాంకుల ఎన్పీఏలు మరింత పెరుగుతాయన్న భయాలతో ఇన్వెస్టర్లు విక్రయాలకు పాల్పడుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజా పతనంలో బ్యాంకింగ్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయానికి బ్యాంక్ నిఫ్టీ 276 పాయింట్లు పతనమై 26,838 పాయింట్ల వద్దకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతంపైగా క్షీణించి రూ. 344 వద్దకు చేరింది. యస్‌బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐలు 1-3 శాతం మధ్య పడిపోయాయి. ఇతర రంగాల షేర్లలో అదాని పోర్ట్స్ 11 శాతం, ఇండియాబుల్స్ హౌసింగ్ 6 శాతం చొప్పున పతనమయ్యాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, మారుతి, అల్రా్టటెక్ సిమెంట్లు 2-4 శాతం మధ్య తగ్గాయి. ఇదే సమయానికి జీ ఎంటర్ప్రైజెస్ 6 శాతం లాభంతో రూ. 338 వద్ద ట్రేడవుతుండగా, ఎల్ అండ్ టీ, విప్రో, టీసీఎస్‌లు 1-2 శాతం లాభాలతో ట్రేడవుతున్నాయి.
You may be interested
అన్ని రకాల స్టాక్స్‌లో పెట్టుబడికి అవకాశం
Monday 28th January 2019ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్, స్మాల్ క్యాప్ ఇలా అన్ని రకాల స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. అందుకు ఇది మల్టీక్యాప్ విభాగంలోకి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు నిలకడగా ఉండడాన్ని గమనించొచ్చు. ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే బెంచ్ మార్క్ కంటే అధిక రాబడులను ఇచ్చింది. స్థిరమైన రాబడులు ఆశించే వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ పథకాన్ని దీర్ఘకాలం ఇన్వెస్టింగ్ కోసం పరిశీలించొచ్చు. పనితీరు ఈ పథకం
గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఈక్విటీల సెగ
Monday 28th January 2019- 2018లో రూ. 570 కోట్ల ఉపసంహరణ - వరుసగా ఆరో ఏడాది తగ్గిన ఇన్వెస్ట్మెంట్స్ న్యూఢిల్లీ: అధిక రాబడుల కోసం ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు చూస్తుండటంతో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) కళ తప్పుతున్నాయి. వరుసగా ఆరో ఏడాది కూడా గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. 2018లో వీటి నుంచి రూ. 571 కోట్ల మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో