STOCKS

News


స్వల్పలాభాలతో ప్రారంభం

Thursday 10th January 2019
Markets_main1547092125.png-23493

గురువారం భారత్‌ మార్కెట్‌ స్వల్పలాభాలతో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 పాయింట్ల లాభంతో 36,258 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 10,859 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 1 శాతంవరకూ పెరగ్గా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌,  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి. 

ఆసియా సూచీలు నష్టాల్లో...

 ఇక గురువారం ఉదయం ఆసియా సూచీల్లో జపాన్‌ నికాయ్‌ 1 శాతంపైగా క్షీణించగా, ఇతర ప్రధన సూచీలు ఉదయం 8.50 గంటలకు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ డిసెంబర్‌లో జరిపిన సమీక్షకు సంబంధించిన మినిట్స్‌ తాజాగా వెల్లడికాగా, అత్యధిక శాతం ఫెడ్‌ సభ్యులు వడ్డీ రేట్లపై మెతకవైఖరి వహించాలని ఆ సమీక్షలో కోరారు. మరోవైపు అమెరికా-చైనాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ముగియగా, చర్చలు తమకు అనుకూలంగా జరిగినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ రెండు  అంశాల నేపథ్యంలో అమెరికా సూచీలు పాజిటివ్‌గా ముగిసాయి.



You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 10th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావివతయ్యే షేర్ల వివరాలు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- ఆంధ్రప్రదేశ్‌లోని డాటా సెంటర్‌ ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మౌఖిక ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 5 గిగా వాట్ డాటా సెంటర్‌ను అదాని గ్రూప్‌ ఏర్పాటు చేయనుంది. ఇర‌వై ఏళ్లలో ల‌క్ష ఉద్యోగాలు క‌ల్పించే ఈ సెంట‌ర్ కోసం అదానీ గ్రూప్ 70 వేల కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డులు పెట్టనుంది. అశోక్‌ లేలాండ్‌:- చెన్నై,

10900పైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Thursday 10th January 2019

విదేశీ మార్కెట్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ గురువారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది.  తన మునపటి ముగింపు(10878)తో పోలిస్తే ఉదయం గం.8:39లకు 28 పాయింట్ల లాభంతో 10,905 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఇక్కడి నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడవుతుంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో స్పాట్‌ నిఫ్టీ 10,850 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, నిఫ్టీ ఫ్యూచర్‌ 10,878 పాయింట్ల వద్ద ముగిసింది.  ఇక ప్రపంచమార్కెట్ల విషయానికొస్తే.... అమెరికా మార్కెట్లు బుధవారం ఒడిదుడుకుల ట్రేడింగ్‌

Most from this category