STOCKS

News


లాభాల ముగింపు

Friday 5th April 2019
Markets_main1554458764.png-24988

వరుస రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌పడింది. ఈ వారం ప్రధమార్థంలో సూచీలు రికార్డుస్థాయిలకు చేరిన తర్వాత లాభాల స్వీకరణతో గత రెండు రోజులుగా క్షీణతను చవిచూసి, తిరిగి వారాంతంలో లాభాల్లో ముగిసాయి. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 177 పాయింట్ల లాభంతో 38,862 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68 పాయింట్లు జంప్‌చేసి 11,666 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. వారాంతంకావడంతో రోజంతా సూచీలు స్వల్పశ్రేణలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. చివరకు టాటా స్టీల్‌, జెఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో,  ఆల్రా‍్టటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు 1-3 శాతం మధ్య లాభాలతో క్లోజయ్యాయి. మరోవైపు పవర్‌గ్రిడ్‌, బ్రిటానియా, ఎస్‌బీఐ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లు 1 శాతంపైగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 29,850 పాయింట్ల స్థాయికి తగ్గిన బ్యాంక్‌ నిఫ్టీ క్లోజింగ్‌లో తిరిగి 30,000 పాయింట్లస్థాయిని అందుకుని, 175 పాయింట్ల లాభంతో 30,075 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 



You may be interested

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై మోర్గాన్‌ స్టాన్లీ అండర్‌వెయిట్‌

Friday 5th April 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై అండర్‌వెయిట్‌గానే ఉన్నట్లు అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. స్టాకు టార్గెట్‌ ధరను రూ. 425గా నిర్ణయించింది. మోర్గాన్‌స్టాన్లీ నిర్ణయంతో శుక్రవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు దాదాపు 2 శాతం నష్టపోయి సుమారు 411 రూపాయల వద్ద ముగిసింది. కంపెనీలో 20-25 శాతం వాటాను విక్రయించి లోన్లు తీర్చి, తనఖాలో ఉన్న షేర్లను విడిపించాలని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎప్పటినుంచో యత్నాలు చేస్తోంది. ఇందుకోసం సోనీతో చర్చలు

త్వరలో బుల్‌ మార్కెట్‌కు శుభం కార్డు!

Friday 5th April 2019

జిమ్‌ ఓ నీల్‌ అమెరికా నిరుద్యోగ గణాంకాలు 49 ఏళ్ల కనిష్ఠాలకు చేరిన నేపథ్యంలో యూఎస్‌ ఫెడరల్‌ త్వరలో రేట్ల పెంపు దిశగా ధోరణి మార్చుకోవచ్చని, అదే జరిగితే స్టాక్‌ మార్కెట్లో వచ్చిన పదేళ్ల (2009-2019) ర్యాలీ ముగింపునకు వస్తుందని గోల్డ్‌మన్‌ సాక్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ మాజీ చైర్మన్‌ జిమ్‌ ఓ నిల్‌ చెప్పారు. విధాన నిర్ణయ పాలసీని కఠినతరం చేస్తామన్న చిన్న సంకేతం ఫెడ్‌ నుంచి వచ్చినా బాండ్‌, స్టాక్‌

Most from this category