STOCKS

News


లాభాల ముగింపు

Tuesday 8th January 2019
Markets_main1546942448.png-23469

సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు అప్‌

రోజంతా ఒడుదుడుకులమయంగా సాగిన మంగళవారంనాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ సూచీలు ఎట్టకేలకు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్ల లాభంతో 35,980 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల పెరుగుదలతో 10,802 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.  ఉదయం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైనా ఆసియా, యూరప్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్న నేపథ్యంలో కొన్ని హెవీవెయిట్‌ షేర్ల తగ్గుదల కారణంగా ఒక దశలో నిఫ్టీ 10,750 పాయింట్ల దిగువకు పడిపోయింది. అటుతర్వాత ఎంపికచేసిన బ్యాంకింగ్‌ షేర్లతో పాటు మెటల్స్‌, ఆటోమొబైల్‌ షేర్లలో జరిగిన కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌ తిరిగి లాభాల్లోకి మళ్లింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు పాజటివ్‌గా ట్రేడ్‌కావడం కూడా ఇక్కడ లాభాల ముగింపునకు ఒక కారణం. నిఫ్టీ-50 షేర్లలో అత్యధికంగా సన్‌ఫార్మా 4 శాతం జంప్‌చేసింది. కొన్ని బ్రోకరేజ్‌లు ఈ షేరును అప్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో ఈ కౌంటర్లో కొనుగోళ్లు జరిగాయి. టాటా మోటార్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, గ్రాసిమ్‌ షేర్లు పెరిగిన వాటిలో వున్నాయి. జీ టెలి, హింద్‌ పెట్రో, బీపీసీఎల్‌, యూపీఎల్‌ షేర్లు 1-2 శాతం మధ్య క్షీణించాయి. 

ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయికి ఐసీఐసీఐ బ్యాంక్‌

కార్పొరేట్‌ రుణాల ఎగవేతతో కొద్దినెలలుగా సతమతమవుతూ కార్పొరేట్‌ లెండింగ్‌ బ్యాంకులుగా పేరొందిన ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లు 3 శాతం మేర ర్యాలీ జరిపాయి. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 382 వద్ద ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయిని తాకింది. ఎస్‌బీఐ సైతం నెలల గరిష్టస్థాయి అయిన రూ. 306 వద్దకు పెరిగింది. యాక్సిస్‌ బ్యాంక్‌ రూ. 650 స్థాయిని అధిగమించగలిగింది. ఈ మూడు బ్యాంకుల తోడ్పాటుతో బ్యాంక్‌ నిఫ్టీ 27,500 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించగలిగింది. ఈ సూచీ 205 పాయింట్లు జంప్‌చేసి నెలల గరిష్టస్థాయి అయిన 27,509 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే రిటైల్‌ బ్యాంకులుగా గుర్తింపు పొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌లు బలహీనంగా ముగిసాయి. 



You may be interested

40వేల కోట్ల పెట్టుబడులు!!

Tuesday 8th January 2019

- ఓఏఎల్‌పీ రెండో రౌండు వేలంపై అంచనా - 14 బ్లాక్‌ల వేలం ప్రక్రియ ప్రారంభం - మార్చి 12లోగా బిడ్ల దాఖలు న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్‌ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద తలపెట్టిన రెండో విడత చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గతేడాది నిర్వహించిన తొలి విడతలో 55 బ్లాక్‌లు వేలం వేయగా

పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఆకర్షణీయం!

Tuesday 8th January 2019

ఆకాశ్‌ జైన్‌ ప్రస్తుత మార్కెట్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని అజ్కాన్‌ గ్లోబల్‌ అనలిస్టు ఆకాశ్‌ జైన్‌ చెప్పారు. భూషన్‌ పవర్‌ సహా పలు కేసుల్లో విచారణ పూర్తయి బ్యాంకులకు త్వరలో పెద్ద మొత్తంలో రుణాలు వసూలు కానున్నాయని ఇటీవల ఆర్థిఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. దీనికితోడు ఇప్పటికే ఎన్‌సీఎల్‌టీలో దాదాపు66 కేసులు పరిష్కారమై సుమారు రూ.80వేల కోట్లు బ్యాంకులకు రికవరీ అయ్యాయి. ఇదే సమయంలో బ్యాంకుల ఎన్‌పీఏలు

Most from this category