STOCKS

News


ముందుంది మరింత పతనం!

Thursday 4th October 2018
Markets_main1538648023.png-20858

నిపుణుల హెచ్చరిక
ఇన్‌ఫ్రా కంపెనీల దెబ్బకు దేశీయ మార్కెట్లు కుయ్యోమొర్రో అనడం ఆరంభించాయి. మూలిగే నక్కపై తాటిపండులాగా ఇదే సమయంలో రూపీ మరింత పతనం కావడం, క్రూడాయిల్‌ ధర ఝమ్మని పెరిగిపోవడంతో మార్కెట్లు కకావికలయ్యాయి. గురువారం మార్కెట్లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ లాంటి దిగ్గజాలు దాదాపు 4 శాతం ఢమాల్‌మన్నాయి. ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దేందుకు ఎన్ని యత్నాలు చేసినా పెద్దగా ఫలితం కానరావడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో భయాలు మరింత పెరుగుతాయని, మరింత పతనం ముందుముందు ఉంటుందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీరేట్లను పెంచక తప్పదని, దీంతో పరిస్థితి మరింత దిగజారవచ్చని అంచనా వేస్తున్నారు. రేట్ల పెంపుదలతో కార్పొరేట్స్‌కు నిధుల లభ్యత కష్టం కానుంది. దీంతో కొత్త పెట్టుబడులు ఆగిపోతాయి. ఇవన్నీ కలిసి ఎకానమీపై సమిష్ఠి ప్రభావం చూపుతాయి. ఇప్పటికే ఇన్‌ఫ్రాలో కంపెనీలు నిధుల లభ్యత లేక అల్లలాడుతున్నాయి. సమీప భవిష్యత్‌లో వీటిలో మరిన్ని కంపెనీలు డిఫాల్ట్‌అయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు బ్యాంకింగ్‌ రంగంలో ప్రక్షాళనకు ప్రభుత్వం, ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవి బ్యాంకులపై ఎంతో ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా ఆర్‌బీఐ జరిపే త్రైమాసిక సమీక్షా సమావేశ ఫలితం మార్కెట్‌ స్వల్పకాలిక గతిని నిర్ధారించనుంది. ఈ దఫా సైతం ఆర్‌బీఐ రేట్ల పెంపుదలకే మొగ్గు చూపవచ్చని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. ఈ చర్య రూపాయిని ఆదుకోవచ్చు కానీ కంపెనీలపై నెగిటివ్‌ ప్రభావం చూపవచ్చని అంచనా. ఈ పరిస్థితులన్నీ సమీక్షిస్తే మార్కెట్లలో మరికొంత కాలం అల్లకల్లోలం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల చిన్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిఉంది. 



You may be interested

ఆర్‌ఐఎల్‌ పతనం సాంకేతికమే!

Thursday 4th October 2018

ఇతర ప్రభావాలేమీ కనిపించడంలేదు మార్కెట్‌ నిపుణులు గురువారం మార్కెట్లు గజగజలాడాయి. దేశీయ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ పతనంతో మార్కెట్లు దిక్కుతోచని పక్షులయ్యాయి. మార్కెట్‌ లీడర్‌ రిలయన్స్‌ షేరు గురువారం ఒక్కరోజే దాదాపు 7 శాతం పైచిలుకు పతనమైంది. ఒక దశలో 1106 రూపాయల వరకు క్షీణించిన ఆర్‌ఐఎల్‌ చివరకు స్వల్పంగా కోలుకొని 1122 రూపాయల వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఢమాల్‌మనడంతో మార్కెట్లు అంతంతకంతకూ పడిపోయాయి. ఉన్నట్లుండి రిలయన్స్‌ షేరు ఇంతలా పడిపోవడం

ఐసీఐసీఐకి చందా కొచర్‌ రాజీనామా!!

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.

Most from this category