News


చెక్కు చెదరని టాటా గ్రూపు మార్కెట్‌ క్యాప్‌!

Thursday 4th October 2018
Markets_main1538677029.png-20863

టాటా గ్రూపుకు సంబంధించి తాజా మార్కెట్‌ క్రాష్‌లో ఒక ఆశ్చర్యకర పరిణామం ఉంది. అదేమిటంటే గ్రూపు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (గ్రూపు మార్కెట్‌ విలువ) పెద్దగా పతనం కాకుండా స్థిరంగా ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆగస్ట్‌ 29న నమోదు చేసిన రికార్డు గరిష్ట స్థాయి రూ.38,989 నుంచి పది శాతం పడిపోయింది. కానీ, ఇదే కాలంలో టాటా గ్రూపు స్టాక్స్‌ను ట్రాక్‌ చేసే నిఫ్టీ టాటా గ్రూపు ఇండెక్స్‌ ఆగస్ట్‌ 29న 6,868.30 పాయింట్ల వద్ద ఉండగా, ఈ బుధవారం(అక్టోబర్‌ 3) రూ.6,870.36 వద్ద ఉంది. 

 

టాటా గ్రూపు నుంచి 26 లిస్టెడ్‌ కంపెనీలు ఉన్నాయి. వీటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.11.5 లక్షల కోట్లు. గత నెల రోజుల్లో నష్టపోయిన మార్కెట్‌ విలువ కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే. నిజానికి ఇటీవలి స్టాక్స్‌ పతనంలో టాటా గ్రూపు షేర్లన్నీ కకావికలం అయినవే. కాకపోతే ఒక్క టీసీఎస్‌ మాత్రం పతనంలో మరోవైపు ఉండి టాటా గ్రూపు విలువను ఆదుకుంది. కానీ, మిగిలిన టాటా గ్రూపు షేర్లన్నీ కూడా 36 శాతం వరకు నష్టాలపాలయ్యాయి. రూపాయి పతనం ఐటీ కంపెనీలకు కలిసొచ్చే పరిణామం కావడంతో టీసీఎస్‌ స్టాక్‌ ర్యాలీ చేసింది. టాటా గ్రూపు మొత్తం మార్కెట్‌ విలువలో టీసీఎస్‌ విలువే 70 శాతం ఉంది. కనుక ఈ పరిణామం టాటా గ్రూపునకు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. 

 

సెప్టెంబర్‌ క్వార్టర్లో రూపాయి 4.5 శాతం మేర పడిపోయిందని, ఇదొక్క అంశంతో అగ్రగామి ఐదు ఐటీ కంపెనీల మార్జిన్లు క్రితం త్రైమాసికంతో పోలిస్తే 1.1 శాతం వరకు మెరుగుపడతాయని అనలిస్టుల అంచనా. ‘‘టాప్‌-5 ఐటీ కంపెనీల మార్జిన్లు రూపాయి కారణంగా విస్తరిస్తాయి. దీంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో 80-110 బేసిస్‌ పాయింట్ల మేర మార్జిన్లు పెరుగుతాయి. ఇందులో టీసీఎస్‌ మార్జిన్లు 1.8శాతం వరకు విస్తరించొచ్చు’’ అని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో పేర్కొంది. మార్కెట్‌ డేటాను గమనిస్తే... గత 24 ట్రేడింగ్‌ సెషన్లలో టీసీఎస్‌ మినహా ఇతర ఏ ఒక్క టాటా గ్రూపు స్టాక్‌ కూడా సానుకూల రిటర్నులు ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ, టీసీఎస్‌ మాత్రం ఇదే సమయంలో (ఆగస్ట్‌ 29-అక్టోబర్‌3) రూ.20,527 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను పెంచుకుంది. టైటాన్‌ కంపెనీ, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టాటా పవర్‌, వోల్టాస్‌ 2-11 శాతం మధ్య నష్టపోయాయి. ఆగస్ట్‌ 29 నాటికి గ్రూపు మార్కెట్‌ క్యాప్‌ రూ.11.64 లక్షల కోట్లుగా ఉండగా, ఈ నెల 3నాటికి రూ.11.48 లక్షల కోట్లకు తగ్గింది.



You may be interested

నిఫ్టీ ఫార్వార్డ్‌ పీఈ@20... ఇప్పుడిక కొనొచ్చా?

Thursday 4th October 2018

తాజా మార్కెట్‌ పతనంతో అంతర్జాతీయ మార్కెట్‌ క్యాప్‌లో భారత వాటా పదేళ్ల చారిత్రక సగటు 2.5 శాతానికి దిగొచ్చిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తన నివేదికలో పేర్కొంది. ఆగస్ట్‌లో 3 శాతం, జూలైలో 6 శాతం పెరిగిన సూచీలు, సెప్టెంబర్‌ నుంచి చూస్తే ఇప్పటికి 10 శాతం మేర పతనం అయ్యాయి. దీంతో ఈ ఏడాది జూలైలో ఉన్న స్థాయికి సూచీలు తిరిగొచ్చేశాయి. దీర్ఘకాలం పాటు వేచి ఉండే

రూపాయి 74 దాటదు!

Thursday 4th October 2018

టీసీఎస్‌ అంచనా వర్ధమాన కరెన్సీల్లో అధ్వాన్న ప్రదర్శన చూపుతున్న భారత రూపాయి కుదురుకుంటుందని టీసీఎస్‌ అంచనా వేస్తోంది. డాలర్‌తో  రూపాయి మారకం విలువ 74 దిగువకు రాదని అభిప్రాయపడింది. రూపీ బాటమ్‌ అవుట్‌ అయ్యేందుకు రెడీగా ఉందని టీసీఎస్‌ ట్రెజరీ హెడ్‌ వెంకటేశన్‌ చెప్పారు. ఒక్క నెల్లో రూపాయి దాదాపు 3 శాతం మేర క్షీణించింది. ఇతర వర్ధమాన కరెన్సీలన్నింటిలో రూపాయి మాత్రమే ఎక్కువగా పతనమైంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి కొత్త

Most from this category