STOCKS

News


క్వాలిటీ షేర్లు ఇవేనంటున్న ఆనంద్‌ రాఠీ..!

Saturday 17th November 2018
Markets_main1542432224.png-22118

ముంబై: ముడిచమురు ధరలు గరిష్టస్థాయిల నుంచి 20 శాతం పతనంకావడం అనేది భారత స్టాక్‌ మార్కెట్లకు అతిపెద్ద రిలీఫ్‌ అని ఆనంద్‌ రాఠీ షేర్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ అడ్వైజరీ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ సెడానీ అన్నారు. ఈ ఒక్క సానుకూలంశం స్థూల ఆర్థిక వ్యవస్థలోని అనేక అంశాలను చక్కబెడుతుందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్లేషించిన ఆయన ఈనెలలోనే మార్కెట్‌ స్థిరీకరణకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం తగ్గడం, వడ్డీ రేట్లు దిగిరావడం, కరెంట్‌ ఖాతాలోటు పెరగకుండా ఉండడం వంటి అనేక సానుకూల అంశాలు క్రూడ్‌ ధరల తగ్గుదలతో ముడిపడి ఉండగా.. 10-ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ సైతం దిగిరావడం అనేది నిధుల కొరతతో సతమతమౌతోన్న ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ రంగాలకు ఊరటనివ్వనుందని విశ్లేషించారు. దేశీ మార్కెట్‌ నవంబర్‌లో స్థిరత్వం పొందే అవకాశం ఉందని అన్నారు. ఈ సమయంలో నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చని సూచించారు. ఈ జాబితాలోని మూడు షేర్లను సిఫార్సుచేశారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  | ప్రస్తుత ధర: రూ.2,003  | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్: రూ.2,420 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో బ్యాంక్‌ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం త్రైమాసికం ప్రాతిపదికన 10 బేసిస్‌ పాయింట్లు, ఏడాది ప్రాతిపదికన 4.3 శాతం వృద్దిరేటును నమోదుచేసింది. థార్డ్‌ పార్టీ బీమా వంటి సాధానాల ఆధారంగా కోర్‌ ఫీ ఆదాయంలో వృద్ధి ఏడాది ప్రాతిపదికన 26 శాతంగా నమోదైంది. నూతన పెట్టుబడి సమీకరణ రుణజారీ పెరుగుదలకు దోహదపడనుందని సిద్ధార్థ్‌ సెడానీ అన్నారు.  ప్రస్తుతం నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఈ బ్యాంక్‌ ప్రయోజనం పొందనుందన్నారు. పోర్టిఫోలియోలో ఉండదగిన నాణ్యమైన షేర్ల జాబితాలో ఈ షేరు ఒకటని సూచించారు.

ఏషియన్‌ పెయింట్స్‌ | ప్రస్తుత ధర: రూ.1,324 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్: రూ.1,471
మంచి ట్రాక్‌ రికార్డ్‌తో ఈ రంగంలోనే మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతున్న కంపెనీ ఇది. నాణ్యమైన యాజమాన్యం కలిగిన ఈ సంస్థ.. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ, మార్కెటింగ్‌లో వినూత వ్యూహాలను అవలంభిస్తోంది. సమర్థవంతమైన ఉత్పత్తి, సరుకు రవాణా వ్యవస్థ కలిగి ఉంది. క్యూ2 ఫలితాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. పెయింట్స్‌ పరిశ్రమ వచ్చే కొద్ది సంవత్సరాలలోనే 8-12 శాతం వృద్ధిరేటును సాధించగలదని అంచనావేస్తున్నామని వివరించారు. 

ఆర్తి ఇండస్ట్రీస్‌ | ప్రస్తుత ధర: రూ.1,439 | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్: రూ.1,600
బెంజీన్ ఆధారిత బేసిక్‌, ఇంటర్‌మీడియేట్‌ కెమికల్స్‌ రంగంలో మార్కెట్‌ లీడర్‌గా ఉన్న ఈ సంస్థ.. 2018-21 కాలంలో ఆదాయంలో 20 శాతం, నికర లాభంలో 22 శాతం చొప్పున చక్రగతి వృద్ధిరేటును సాధించనుందని అంచనావేశారు. క్యూ2లో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 46.4 శాతం వృద్ధి చెంది రూ.1290 కోట్లకు చేరుకుంది.పరిశోధన, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్న ఈ సంస్థకు క్లైంట్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 పీఈ అంచనా 31 రెట్లు, 2021 పీఈ అంచనా 21 రెట్లుగా విశ్లేషించారు.

ఇవి కేవలం సిద్ధార్థ్‌ సెడానీ అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.You may be interested

మరో 200 మంది నియామకం:రియల్‌పేజ్‌

Saturday 17th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సాఫ్ట్‌వేర్‌, డేటా అనలిటిక్స్‌ సేవలు అందిస్తున్న రియల్‌పేజ్‌ వచ్చే ఏడాదిలోగా మరో 200 మందిని నియమించుకోనుంది. యూఎస్‌కు చెందిన ఈ సంస్థకు హైదరాబాద్‌ కార్యాలయంలో 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. డేటా అనలిటిక్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాల్లో ఇక్కడి టీమ్‌ నైపుణ్యత సంస్థ విస్తరణలో కీలకమని రియల్‌పేజ్‌ సీవోవో అశ్లే గ్లోవర్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా

బోధ్‌ట్రీ లాభంలో 171 శాతం వృద్ధి

Saturday 17th November 2018

సెప్టెంబరు క్వార్టరులో బోధ్‌ట్రీ కన్సల్టింగ్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 171 శాతం అధికమై రూ.1.28 కోట్లుగా నమోదయింది. టర్నోవరు 12 శాతం పెరిగి రూ.12.8 కోట్లకు చేరుకుంది. శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 1.91 శాతం హెచ్చి రూ.56.05 వద్ద స్థిరపడింది.

Most from this category