STOCKS

News


ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ నుంచి సరళ విధానాలు-మార్కెట్‌ అంచనా

Tuesday 11th December 2018
Markets_main1544518483.png-22825

కేంద్ర ప్రభుత్వపు వృద్ధి లక్ష్యాలు.. ఆర్‌బీఐ ఆర్థిక నిర్వహణ అంశాలు రెండూ కలిస్తే బాగుంటుందని కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దెవేన్‌ చోక్సీ తెలిపారు. వచ్చే కొత్త గవర్నర్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. మార్కెట్‌ వర్గాలు చాలా అంశాలను గమనిస్తూ ఉంటుందని, అందులో ఒకటి ఆర్‌బీఐ గవర్నర్‌ అంశమని తెలిపారు. కొత్త గవర్నర్‌.. ప్రభుత్వ లక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటూ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా వ్యవహరిస్తారని మార్కెట్‌ అంచనా వేస్తుందని పేర్కొన్నారు. ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాలు ఆర్థిక వృద్ధికి దోహదపడేలా లేవని కార్పొరేట్‌ రంగం అభిప్రాయపడుతోందని తెలిపారు. ఈ అంశాన్ని అర్థం చేసుకుని, తగిన పాలసీలను అనుసరించే వ్యక్తి కోసం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. మార్పు మంచి కోసమే అని మార్కెట్‌ అంచనాకు వచ్చిందని తెలిపారు. తదుపరి గవర్నర్‌ ఎవరనే అంశంపై అస్పష్టత నెలకొందని పేర్కొన్నారు. 
మార్కెట్‌ ఎన్నికల ఫలితాలకు పెద్దగా స్పందించకపోవచ్చని దెవేన్‌ చోక్సీ అంచనా వేశారు. కరెక‌్షన్‌ ఎక్కువగా ఉండదని తెలిపారు. మార్కెట్‌ వర్గాలు ఫలితాలను ముందుగానే అంచనా వేశాయని పేర్కొన్నారు. తక్కువ స్థాయిల్లో నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేయడానికి మార్కెట్‌లో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్లోబల్‌ ఫండ్స్‌ ఇండియన్‌ మార్కెట్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కు తీసుకుంటే.. అప్పుడు రూపాయిపై ఒత్తిడి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ 55-65 డాలర్ల శ్రేణిలో కదలాడితే రూపాయి మళ్లీ 70 స్థాయికి రావొచ్చని అంచనా వేశారు. 
ఆటోమొబైల్‌ విభాగంలో బజాజ్‌ ఆటో స్టాక్‌కు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అశోక్‌ లేలాండ్‌ షేరును కూడా చూడొచ్చని పేర్కొన్నారు. ద్రవ్యల్బోణ కట్టడి ముఖ్యమైన అంశమేనని, అయితే ఆర్‌బీఐ వృద్ధికి కూడా ప్రాధాన్యమివ్వాల్సి ఉందని తెలిపారు. 



You may be interested

లాభాల్లో ఫార్మా షేర్లు

Tuesday 11th December 2018

డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. నేడు ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌ మారకంలో 72.05 స్థాయికి పతనమైంది. రూపాయి క్షీణత విదేశాలకు ఎగుమతులు చేసి డాలర్ల మారకంలో ఆదాయాలను ఆర్జించే కంపెనీలకు కలిసొస్తుందని అంచనాలతో ఫార్మా షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని ఇండెక్స్‌లో అత్యధికంగా ఫార్మా ఇండెక్స్‌ 3శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపుతో పోలిస్తే 2.55శాతం లాభంతో 8,753.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

10300 పాయింట్లే కీలకం!

Tuesday 11th December 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు అటుఇటు ఊగిసలాడుతున్నాయి. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లు సైతం బలహీనంగా ఉన్నాయి. ఇటు చూస్తే ఆర్‌బీఐ గవర్నర్‌ అనూహ్య రాజీనామా నిర్ణయం వచ్చింది. ఇవన్నీ మదుపరులను అయోమయంలో, ఆందోళనలో పడేస్తున్నాయి. అయితే టెక్నికల్స్‌ ఆధారంగా ట్రేడింగ్‌ చేయాలని, ఆచితూచి వ్యవహరించాలని, తాజా పరిస్థితులకు బెంబేలెత్తవద్దని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచిస్తోంది. గత ఐదు సెషన్లలో నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు నష్టపోయింది. దీంతో గత అప్‌స్వింగ్‌(10004

Most from this category