News


ప్రతి ఐదు స్టాక్స్‌లో ఒక్కటే లాభాల్లో...

Tuesday 2nd October 2018
Markets_main1538459013.png-20789

ప్రస్తుత ఏడాది ప్రతి ఐదు స్టాక్స్‌లో ఒక్కటి మాత్రమే లాభాలను అందించింది. నష్టపోయిన షేర్లతో పోలిస్తే లాభపడినవి ఇంత తక్కువగా వుండటం గత ఏడేళ్లలో చూస్తే ఇదే ప్రధమం. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉండటం కారణం. అడ్వాన్స్‌-డిక్లెన్‌ రేషియో 0.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-500 ఇండెక్స్‌లో 113 స్టాక్స్‌ లాభపడితే.. 380 స్టాక్స్‌ నష్టపోయాయి. 
ఇండియా బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ-50.. ఈ ఏడాది ఇప్పటి దాకా 3.6 శాతంమేర పెరిగింది. అయితే బ్రాడర్‌ నిఫ్టీ-500.. 4.4 శాతం పతనమైంది. గ్లోబల్‌ టారిఫ్‌ వార్‌, అధిక క్రూడ్‌ ధరలు, రూపాయి బలహీనత వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల డిఫాల్ట్‌ వల్ల నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లపై నెలకొని ఉన్న లిక్విడిటీ ఆందోళనల వల్ల మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సెప్టెంబర్‌లో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 14 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 20 శాతంమేర పతనమయ్యాయి. 2008 అక్టోబర్‌ నుంచి చూస్తే ఇండెక్స్‌లు ఒక్క నెలలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. 
ఈ ఏడాది వక్రంగీ అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. ఈ స్టాక్‌ 94 శాతంమేర పతనమైంది. దీని తర్వాత పీసీ జువెలర్స్‌ 88 శాతం, 8కే మైల్స్‌ 80 శాతం నష్టపోయాయి. ఇక మెర్క్‌ 106 శాతం, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ 93 శాతం, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ 75 శాతం లాభపడ్డాయి. ‘అడ్వాన్స్‌-డిక్లెన్‌ రేషియో తక్కువగా ఉండటమనేది ఓవర్‌సోల్డ్‌ మార్కెట్‌ను సూచిస్తుంది. అలాగే అడ్వాన్స్‌-డిక్లెన్‌ రేషియో ఎక్కువగా ఉంటే అది ఓవర్‌బాట్‌ మార్కెట్‌ను తెలియజేస్తుంది’ అని జాయిన్‌డ్రే క్యాపిటల్‌ సర్వీసెస్‌ హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అవినాశ్‌ గోరఖ్‌శంకర్‌ తెలిపారు. మార్కెట్‌పై అన్ని ప్రతికూల అంశాల ప్రభావం కనిపిస్తోందని, రెండో త్రైమాసికపు ఎర్నిం‍గ్స్‌పై ఆధారపడి రికవరీ ఉండొచ్చని అంచనా వేశారు. You may be interested

బంధన్‌ బ్యాంక్‌ ...ఇన్వెస్టర్లూ జాగ్రత్త..

Tuesday 2nd October 2018

లైసెన్స్‌ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ శుక్రవారం కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ పారితోషికాన్ని స్తంభింపజేసింది. దీంతో బంధన్‌ బ్యాంక్‌ ఇన్వెస్టర్లు ఎగ్జిట్‌ అవుతున్నారు. యూనివర్సల్‌ బ్యాంకింగ్‌ నిబంధనలకు అనువుగా బంధన్‌ బ్యాంకులో నాన్‌-ఆపరేటివ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను మూడేళ్లలో (2015 ఆగస్ట్‌ నుంచి)

ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అప్‌..

Tuesday 2nd October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ సోమవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో ఏడీఆర్‌లు పెరిగాయి. అదేసమయంలో వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోయింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది.    టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.37 శాతం పెరుగుదలతో 15.57 డాలర్లకు ఎగసింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌

Most from this category