STOCKS

News


మార్కెట్లలో అనిశ్చితే ఒక అవకాశం: యూనియన్‌ ఏఎంసీ

Tuesday 19th March 2019
Markets_main1552934641.png-24674

స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని స్నేహితునిగా మలుచుకోవాలని, దీర్ఘకాలం దృష్టితో ముందడుగు వేయాలని యూనియన్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వినయ్‌ పహారియా సూచించారు. పెట్టుబడుల కేటాయింపులను గుర్తించి అందుకు కట్టబడి ఉండాలని చెప్పారు. వినియోగదారుల విచక్షణారహిత వినియోగంపై ఆధారపడిన కంపెనీలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో కన్జ్యూమర్‌ స్టాపుల్‌ అంత ఆకర్షణీయంగా లేదన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు. 

 

మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని ఏ విధంగా అధిగమించొచ్చన్న ప్రశ్నకు... అనిశ్చితిని ఫ్రెండ్‌గా మలచుకోవడమేనన్నారు. దీర్ఘకాల పెట్టుబడుల విధానంపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరివారు తమకు అనువైన పెట్టుబడుల విధానాన్ని రూపొందించుకుని దానికి నూరుపాళ్లు కట్టుబడి ఉండాలని సలహా ఇచ్చారు. ఇన్వెస్టర్లు ఎన్నికల వంటి సమీప కాల అనిశ్చితి గురించి మరీ ఎక్కువగా చదవొద్దని సూచిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికలు కీలకమైన అంశమే అయినప్పటికీ... సమీప కాలంలో ఆర్థిక రంగం, కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై దీని ప్రభావం ఉంటుందేమో గానీ, దీర్ఘకాలానికి ఇది సాధారణమైపోతుందని అభిప్రాయపడ్డారు. వినియోగదారుల విచక్షణారహిత వినియోగంపై ఆధారపడిన స్టాక్స్‌పై ఎక్కువ సానుకూలత ఉండడానికి వాటి వ్యాల్యూషన్లే కారణమన్నారు. వీటిల్లో కంపెనీల వ్యాల్యూషన్లు ఎంతో ఆకర్షిస్తున్నాయని చెప్పారు. కన్జ్యూమర్‌ స్టాపుల్‌ విభాగంలో విలువలు అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో అండర్‌వెయిట్‌తో ఉన్నట్టు తెలిపారు. 

 

ఆకర్షణీయ విలువలతో ఉన్న ఇతర రంగాల గురించి పహారియా స్పందిస్తూ... యుటిలిటీస్‌ చాలా ఆసక్తికరంగా ఉన్నట్టు చెప్పారు. ఈ రంగంలోని కంపెనీలకు హామీతో కూడిన రాబడులు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇటీవలే నియంత్రణ సంస్థ... వచ్చే ఐదేళ్ల కాలానికి రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీని స్థిరంగా ఉంచిందని, ప్రస్తుత వడ్డీ రేట్లను గమనిస్తే ఈ విభాగంలో వ్యాల్యూషన్లు ఎంతో ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగంపై తాము అధిక వెయిటేజీతో ఉన్నట్టు పహారియా చెప్పారు. You may be interested

చాలా తక్కువలో ట్రేడవుతున్న హోల్డింగ్‌ కంపెనీలు

Tuesday 19th March 2019

మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా దిగ్గజ కంపెనీల వ్యాల్యూషన్లు పడిపోయిన విషయాన్ని ఇన్వెస్టర్లు కళ్లారా చూశారు. స్టాండలోన్‌ కంపెనీలను విశ్లేషించడం సులువే. కానీ, ఎన్నో కంపెనీలకు పేరెంట్‌ కంపెనీగా ఉన్న స్టాక్‌ను విశ్లేషించడం అంత సులువేమీ కాదన్నది విశ్లేషకుల మాట. ఇక హోల్డింగ్‌ కంపెనీ షేరును కొన్నారంటే.. అందులో ఉన్న వ్యాపారాలన్నింటిపై ఇన్వెస్ట్‌ చేసినట్టే అవుతుంది. వీటిల్లో వ్యాపారాలన్నీ ఇన్వెస్టర్లను ఆకర్షించేవి కాకపోవచ్చు. నిజానికి హోల్డింగ్‌ కంపెనీల షేర్ల ధరలు

రూపాయి బలం వెనుక కారణాలు

Tuesday 19th March 2019

రూపాయి ఈ స్థాయి నుంచి ఇంకొంత లాభపడే అవకాశాలు ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌పాండా తెలిపారు. సాంకేతికంగా 68.80 సాంకేతిక స్థాయి అని తాను ఎప్పటి నుంచో చెబుతున్నట్టు గుర్తు చేశారు. రూపాయి ఈ స్థాయిని బ్రేక్‌ చేయడంతో 68.46 వరకు వెళ్లొచ్చన్నారు.  రూపాయి బలం ఇందు వల్లే...  మార్చిలో రూపాయి టర్న్‌ అరౌండ్‌ కావడం వెనుక ఐదు ప్రాథమిక కారణాలు ఉన్నాయి.  మార్చి నెలలో దాదాపు సాధారణంగా రూపాయి

Most from this category