STOCKS

News


మళ్లీ మోది వస్తే 7 శాతం అప్‌..రాహుల్‌ అయితే 2 శాతం

Thursday 28th February 2019
Markets_main1551350902.png-24382

ఎన్నికల ఫలితాల అనంతరం సెన్సెక్స్‌పై అంచనాలు

మే నెలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని, నరేంద్ర మోది ప్రభుత్వం తిరిగి అధికారం చేపడితే ఈక్విటీలకు అత్యంత అనుకూలంగా వుంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఆగస్టు 29 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,989 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని తాకిన తర్వాత ఇప్పటివరకూ 8 శాతం నష్టపోయింది. 2018లో కనిష్టస్థాయి నుంచి వేగంగా కోలుకుని, కొత్త గరిష్టస్థాయికి చేరిన తీరు ఈ ఏడాది కొరవడిందని, ఎన్నికల ఫలితాల పట్ల అనిశ్చితే ఇందుకు కారణమని రాయటర్స్‌ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో నిపుణులు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 13–25 తేదీల మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 50 మంది ఈక్విటీ వ్యూహకర్తలు పాల్గొన్నారు. ఇండో–పాక్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు మునుపు ఈ సర్వే జరిగింది. నరేంద్ర మోది నేతృత్వంలో తిరిగి బీజేపీ అధికార పగ్గాల్ని చేపడితే ఇప్పటివరకూ సెన్సెక్స్‌ చవిచూసిన నష్టాల్ని దాదాపు పూడ్చుకుని 7 శాతం ర్యాలీ జరిపే అవకాశం వుందని అత్యధిక శాతం నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల స్థాయికి అటూఇటూగా ట్రేడవుతున్నది. ఈ ఏడాది మధ్యనాటికి సెన్సెక్స్‌ 2.7 శాతం పెరిగి 36,960 పాయింట్లకు చేరవచ్చని, మోది అధికారం చేపడితే ఈ సంవత్సరాంతానికి 37,975 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చని వారు అంచనావేస్తున్నారు. అయితే బీజేపీకి మెజారిటీ తగ్గి, ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే...3.5 శాతం మాత్రమే మార్కెట్‌ పెరుగుతుందని వారు అంచనాల్లో పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ మెజారిటీతో అధికారం చేపడితే.. ఫలితాల అనంతరం  మార్కెట్‌ 2 శాతం పెరగవచ్చని నిపుణులు అభిప్రాయడం వ్యక్తంచేశారు. కానీ కాంగ్రెస్‌...ఇతర పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సివస్తే సెన్సెక్స్‌ 3 శాతం వరకూ పతనమయ్యే ప్రమాదం వుంటుందని వారు హెచ్చరించారు. 

 



You may be interested

ఈ సమయంలో ఏ ఫండ్స్‌ బెటర్‌?

Thursday 28th February 2019

మార్కెట్లు తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తున్న ఈ సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లలో ఏ ఫండ్స్‌ను ఆశ్రయించాలన్న సందేహం రావొచ్చు. అయితే, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయదలిచిన ఇన్వెస్టర్లు ఈ సందేహాలను పక్కన పెట్టేసి సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసుకుంటూ వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఏ ఫండ్స్‌ను నమ్ముకోవచ్చన్న ప్రశ్నకు... ఇండెక్స్‌ ఫండ్స్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ సమ్మిళితంగా ఎంపిక ఉంటే బావుంటుందని సూచిస్తున్నారు.    ఇన్వెస్టర్లు మల్టీక్యాప్‌ పథకాలను ఎంచుకుంటే... ప్రత్యేకంగా

10800 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 28th February 2019

మూడోరోజూ నష్టాలే..! భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్‌ 10800 మార్కును కోల్పోయింది. నేడు ఫిబ్రవరి సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల చివరిరోజు కావడంతో అమ్మకాలు జోరుగా సాగడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపరిచింది. సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టపోయి 35,867 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లను నష్టపోయి 10,792.50 వద్ద స్థిరపడింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category