STOCKS

News


ఎం&ఎం ఫైనాన్స్‌ 7శాతం అప్‌..!

Tuesday 25th September 2018
Markets_main1537858436.png-20556

ముంబై:- లిక్విడిటీ కొరత కారణంగా కొన్ని హౌసింగ్స్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం&ఎం)ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ షేరు మాత్రం లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో ఎం&ఎం ఫైనాన్స్‌ షేరు రూ.391.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రేటింగ్‌ సంస్థలు ఎం&ఎం ఫైనాన్స్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరిగింది. ఫలితంగా ఇంట్రాడేలో షేరు 7.50శాతం ర్యాలీ చేసి రూ.420.20 గరిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేరు గత ముగింపుధర(రూ.391.75)తో పోలిస్తే 5శాతం లాభంతో రూ. 411.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.386.75 రూ.420.20లుగా నమోదయ్యాయి.
ఎం&ఎం షేరు కొనవచ్చు: కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రేటింగ్‌
మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేరుకు ప్రముఖ రేటింగ్‌ సంస్థ కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. హౌసింగ్‌ విభాగంలో మంచి వృద్ధి అవకాశాలున్నాయని, ప్రభుత్వం ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో గృహాల ఏర్పాటుకు ప్రణాళిలకు సిద్ధం చేస్తుండటం కంపెనీ కలిసొచ్చే అంశమని కోటక్‌ పేర్కొంది. ఇటీవల హౌసింగ్స్‌ ఫైనాన్స్‌ షేర్లను ఇబ్బంది పెడుతున్న లిక్విడిటీ కొరత ఏర్పడకుండా తన మాతృసంస్థ మహీంద్రా గ్రూప్‌ చూసుకుంటుందని కోటక్‌ అంచనా వేస్తుంది.
రేటింగ్‌: కొనవచ్చు
ధర ప్రస్తుత ధర: రూ.411
టార్గెట్‌ ధర: రూ.450.



You may be interested

15% కరెక‌్షన్‌.. అయినా కొనొద్దు..

Tuesday 25th September 2018

ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌ 10-15 శాతం కరెక‌్షన్‌ అయ్యాయని కొనడానికి వెంపర్లాడవద్దని సూచించారు ఐథాట్‌ ఫౌండర్‌ శ్యామ్‌ శేఖర్‌. ఎన్‌బీఎఫ్‌సీ ర్యాలీ ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని, స్టాక్‌ ధరల కదలికల ఆధారంగా గుడ్డిగా ఏ నిర్ణయం తీసుకోకూడదని హెచ్చరించారు. రేట్లు ఎలా మారుతున్నాయి.. వ్యవస్థలో లిక్విడిటీ ఎలా పనిచేస్తోంది.. అనే అంశాలను గమనించాలని తెలిపారు. మైక్రోక్యాప్‌ షేర్లు పాజిటివ్‌ రిటర్న్స్‌ అందిస్తాయని అనుకోవడం అవివేకమని పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఐలను ఆకర్షించేంత సీన్‌ లేదు!

Tuesday 25th September 2018

భారత్‌ మార్కెట్‌పై బోఫా ఎంఎల్‌ అంచనా భారత ఈక్విటీల వాల్యూషన్లు విదేశీ మదుపరులను ఆకర్షించే స్థాయిలో లేవని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ అభిప్రాయపడింది. దేశీయ ఈక్విటీలు ఉండాల్సినదానికన్నా ఎక్కువ స్థాయిలకు పెరిగాయని తెలిపింది. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే చాలా అధిక స్థాయిల వద్ద ఉన్నాయని తెలిపింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత ఈక్విటీల్లో రిస్కులు పెరుగుతాయని అంచనా వేసింది. తాజా కరెక‌్షన్‌ ఆరంభమేనని,

Most from this category