STOCKS

News


వచ్చే ఏడాది మార్కెట్‌ మెరుగు!!

Thursday 15th November 2018
Markets_main1542276228.png-22052

వచ్చే ఆర్థిక సంవత్సరం బాగుంటుందంటున్నారు సీఎల్‌ఎస్‌ఏ ఇండియా స్ట్రాటజిస్ట్‌ మహేశ్‌ నండూర్కర్‌. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలోకి వెళ్లే కొద్ది లిక్విడిటీ సమస్య ప్రభావాలు కనిపిస్తాయని, నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆం‍గ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఇండియన్‌ మార్కెట్లపై కొంత కాలం జాగ్రత్తతో ఉండాలని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా పలు సవాళ్ల కారణంగా మార్కెట్లు కరెక‌్షన్‌కు గురవుతూ వస్తున్నాయని తెలిపారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రతికూలతలు ఇంకా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో వడ్డీ రేట్ల పెంపు వాతావరణం ఉందని తెలిపారు. నిధుల సమీకరణ వ్యయాలు ప్రభావం ఇంకా కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లపై కానీ, ఆర్థిక వ్యవస్థపై కానీ పడలేదని తెలిపారు. అలాగే క్రూడ్‌ ధరల ప్రస్తుతం తగ్గుతున్నప్పటీ, రానున్న కాలంలో పెరిగే అవకాశముందని అంచనా వేశారు. ఎన్నికల ముగిసే వరకు మార్కెట్లలో అస్థిరతల ఉంటాయని తెలిపారు. 
విదేశీ ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే భారత్‌ ఎప్పుడూ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్లకు అనువైన మార్కెట్‌గా ఉంటుందని మహేశ్‌ నండూర్కర్‌ పేర్కొన్నారు. రానున్న సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి రేటు మరింత పెరగొచ్చని అంచనా వేశారు. అయితే విదేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుతం వ్యాల్యుయేషన్స్‌ పరంగా ఆందోళనకరంగా ఉన్నారని తెలిపారు. చైనా, బ్రెజిల్‌, కొరియా, తైవాన్‌ వంటి పలు వర్ధమాన మార్కెట్లతో భారత్‌ను పోల్చి చూస్తే.. ఇండియన్‌ మార్కెట్లు సగటు పీఈ కన్నా ఎక్కువ స్థాయిల్లో ట్రేడవుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఇతర వర్ధమాన మార్కెట్లు సగటు పీఈ కన్నా తక్కువ స్థాయిల్లో ట్రేడవుతున్నాయని తెలిపారు. అందువల్ల వ్యాల్యుయేషన్స్‌ పరంగా విదేశీ ఇన్వెస్టర్లు ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు. దేశీ ఈక్విటీ పెట్టుబడుల వల్ల ప్రీమియం వ్యాల్యుయేషన్స్‌ కొనసాగవచ్చని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ సమస్య తగ్గుతోందన్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఎన్‌బీఎఫ్‌సీ వృద్ధి రేటు తగ్గిపోతుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో డిమాండ్‌ పుంజుకుంటోందని, ఐటీ నియామకాలు పెరుగుతున్నాయని మహేశ్‌ నండూర్కర్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ సమస్యలు కొలిక్కి వస్తున్నాయన్నారు. హౌసింగ్‌ విభాగంపై బుల్లిష్‌గా ఉన్నామని, అయితే కొన్ని సమస్యల వల్ల ఇందులో రికవరీ వాయిదా పడుతూ వస్తోందని తెలిపారు. డీమోనిటైజేషన్‌, రెరా అమలు, జీఎస్‌టీ, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొన్నారు. రానున్న కాలంలో హౌసింగ్‌ విభాగంలో మంచి వృద్ధి నమోదవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. స్టీల్‌, ఆటో, డ్యూరబుల్స్‌ విభాగాల్లో సామర్థ్యం వినియోగం పెరిగిందని తెలిపారు. పెట్టుబడులు మెరుగుపడితే హౌసింగ్‌ విభాగం పుంజుకుంటుందని, తద్వారా ఆర్థిక వృద్ధి పెరుగుతుందని వివరించారు. 
ఫార్మా, ఐటీ రంగాలపై ఓవర్‌వెయిట్‌తో ఉన్నామని మహేశ్‌ నండూర్కర్‌ తెలిపారు. ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ కూడా ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నారు. ఇకపోతే టెలికం, సిమెంట్‌ సహా మెటీరియల్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ, ఫైనాన్షియల్‌ విభాగాలపై అండర్‌వెయిట్‌తో ఉన్నామని తెలిపారు. You may be interested

రూపాయి ర్యాలీతో లాభాల ముగింపు

Thursday 15th November 2018

మళ్లీ 10600 పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా గురువారం సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభాల్ని ఆర్జించగా, నిప్టీ సూచీ మళ్లీ 10600 మార్కును అందుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో సూచీలు మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మిడ్‌సెషన్‌ సమయానికి డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, ఆసియా మార్కెట్ లాభాల ముగింపు  ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. రూపాయి

మెటల్‌ షేర్ల మెరుపులు

Thursday 15th November 2018

మిడ్‌సెషన్‌ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌లో మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఎన్‌ఎన్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 1.50శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(3382.15)తో పోలిస్తే దాదాపు 1.25శాతం లాభంతో 3,424.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌

Most from this category