News


పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం కీలకం

Monday 10th June 2019
Markets_main1560149391.png-26192

  • వాణిజ్య యుద్ధ భయాలు, క్రూడాయిల్‌ ధరలూ ప్రధానమే
  • ఈ వారం మార్కెట్లకు దిశా నిర్దేశం చేసే అంశాలు

పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధాలు, క్రూడాయిల్‌ ధరలు తదితర అంతర్జాతీయ అంశాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో నిధుల సంక్షోభ పరిస్థితులు గత వారం ఈక్విటీ మార్కెట్లను కలవరపర్చాయి. ఈ వారం కూడా ఇన్వెస్టర్లు ఈ అంశంపై దృష్టి సారించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి వంటి కీలక డేటా ఆధారంగా మార్కెట్‌ ట్రేడింగ్‌ జరగొచ్చు. రుతుపవనాల పరిస్థితి ఎలా ఉండబోతుందన్నదీ ముఖ్యమే. ఇక రాబోయే బడ్జెట్‌పైనా అందరి దృష్టి ఉంటుంది. ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయగలదన్న ఆశాభావం నెలకొంది. ఇక, అమెరికా–మెక్సికో–చైనా వాణిజ్య యుద్ధ భయాలు, ఈ నెలాఖరులో ఒపెక్‌ సమావేశం నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరల కదలికలు తదితర అంతర్జాతీయ అంశాలు కీలకంగా ఉండనున్నాయి‘ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

బుధవారం గణాంకాలు...
పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం రేటు గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. ఇక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం మార్కెట్‌ వేళలు ముగిసిన తర్వాత వెల్లడవుతాయి. ‘ ఈ వారం ద్రవ్యోల్బణం గణాంకాలపై అందరి దృష్టి ఉంటుంది. ఆ గణాంకాల వెల్లడి తర్వాత వాణిజ్య యుద్ధం, డాలరుతో రూపాయి మారకం, ముడిచమురు ధరలు వంటి అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా దేశీ మార్కెట్లు సర్దుకోవడం మొదలుకావచ్చు. దేశీ అంశాలు కాస్త వెనక్కి పోయి.. ఈ విషయాలు మార్కెట్లకు చోదకంగా పనిచేయొచ్చు‘ అని ఎపిక్‌ రీసెర్చ్‌ సంస్థ సీఈవో ముస్తఫా నదీమ్‌ తెలిపారు. ‘ఫెడ్‌ సమావేశం, జీ20 సమావేశం, జూలైలో కేంద్ర బడ్జెట్‌ వంటి అంశాలు చూడాల్సి ఉంటుంది‘ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ జర్బాదే పేర్కొన్నారు. ఇక విదేశీ నిధుల ప్రవాహం, రూపాయి.. ముడి చమురు ధరల కదలికలు సైతం మార్కెట్‌కు కీలకంగా ఉండగలవని విశ్లేషకులు తెలిపారు. 

బలహీనంగా రూపాయి...
రూపాయి మారకం విలువ ట్రేడింగ్‌ బలహీనంగా ఉండొచ్చని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ సంస్థ ఫారెక్స్‌ అండ్‌ రేట్స్‌ విభాగం హెడ్‌ సజల్‌ గుప్తా పేర్కొన్నారు. ఈ వారం డాలర్‌తో పోలిస్తే రూపాయి ట్రేడింగ్‌ 69.30–70.10 శ్రేణిలో తిరుగాడవచ్చని తెలిపారు. సాంకేతిక చార్ట్‌లపరంగా చూస్తే నిఫ్టీ 50 మధ్యంతరంగా అప్‌ట్రెండ్‌లోనే కొనసాగవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ విభాగం హెడ్‌ దీపక్‌ జసానీ వివరించారు. ఇందుకు 11,769 పాయింట్ల మద్దతు స్థాయిని కాపాడుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఎఫ్‌పీఐల జోరు...
విధానపరమైన సంస్కరణలు అమలవుతాయనే ఉద్దేశంతో విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జూన్‌ మొదటి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 7,095 కోట్లు దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేశారు. వరుసగా నాలుగు నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నికరంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. మేలో రూ. 9,031 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 16,093 కోట్లు, మార్చిలో రూ. 45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 11,182 కోట్లు (ఈక్విటీ, డెట్‌) క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేశారు. డిపాజిటరీల తాజా గణాంకాల ప్రకారం జూన్‌ 3–7 మధ్యలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 1,915 కోట్లు ఈక్విటీల్లో, రూ. 5,180 కోట్లు డెట్‌ సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. వారం మొత్తంలో ఒక రోజు కూడా ఉపసంహరణ జరగకపోవడం గమనార్హమని గ్రో సంస్థ సీవోవో హర్ష్‌ జైన్‌ చెప్పారు.

 You may be interested

సెన్సెక్స్‌ తక్షణ అవరోధం 40,030

Monday 10th June 2019

మార్కెట్‌ అంచనాల్ని మించి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిప్పటి నుంచి స్టాక్‌ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నప్పటికీ, ఆ రికార్డుస్థాయికి ఒక్కరోజుకూడా నిలుపుకోలేక అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో మూడు దఫాలు రికార్డుస్థాయికి చేరిన తర్వాత వెనువెంటనే 2-3 శాతం మేర పతనాల్ని చవిచూసాయి. గతవారం రిజర్వుబ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత కూడా ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సంక్షోభం మార్కెట్‌ క్షీణతకు కారణమయ్యింది. ఇదేతరహా

11750 కోల్పోతే భారీ పతనం?!

Monday 10th June 2019

బొనాంజ పోర్టుఫోలియో అంచనా దేశీయ మార్కెట్లు వారాన్ని లాభాలతో ఆరంభించాయి. నిఫ్టీ 11975 పాయింట్ల వరకు ఎగిసినా ఆ లాభాలని నిలబెట్టుకోలేక మధ్యాహ్నానికి 11900 పాయింట్ల వద్ద స్వల్పలాభంతో ట్రేడవుతోంది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ రైజింగ్‌ చానెల్‌ మధ్యలో కదలాడుతోందని, ఈ చానెల్‌లో ఉన్నంత వరకు దిగవకు వచ్చినప్పుడల్లా కొనుగోలు చేయడం, పై అవధి వద్ద అమ్మడం చేయవచ్చని బొనాంజా పోర్టుఫోలియో అనలిస్టు రూపక్‌డే సూచించారు. దీంతో పాటు చార్టుల్లో హైపీక్‌

Most from this category