STOCKS

News


మిడ్‌క్యాప్స్‌పై ఫోకస్‌ పెంచండి

Tuesday 26th March 2019
Markets_main1553592206.png-24805

మాక్కై‍్వరీ సలహా
ఈ ఏడాది ఆరంభం నుంచి లార్జ్‌క్యాప్స్‌లో అప్‌మూవ్‌ కొనసాగుతూ వస్తోంది. తాజా ర్యాలీలో సైతం పెద్ద స్టాకులే ఎక్కువ సందడి చేశాయి. అయితే ఇకపై మిడ్‌క్యాప్స్‌ హవా ఆరంభం కానుందని, అందువల్ల ఇన్వెస్టర్లు తమ దృష్టిని చిన్న, మధ్యతరహా స్టాకులవైపు మరలించాలని సలహా ఇస్తోంది. ఎకనమిక్‌ గ్రోత్‌లో రికవరీ, సాధారణ ఎన్నికలపై ఆశలతో దేశీయ మార్కెట్లో నిధుల ప్రవాహం కొనసాగుతుందని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఇండియా ఈక్విటీ మార్కెట్లో విదేశీ మదుపరులు దాదాపు 40వేల కోట్ల రూపాయల నిధులను కుమ్మరించారు. ఒక్క మార్చిలోనే 26వే లకోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. కొత్త ఆర్థిక సంవత్సరారంభం నుంచి ట్రెండ్‌లో మార్పు వస్తుందని, మిడ్‌క్యాప్స్‌ హవా ఆరంభమవుతుందని మాక్కై‍్వరీ అంచనా వేసింది. అందుకే పోర్టుఫోలియోలో మిడ్‌క్యాప్స్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని సూచించింది. రంగాలవారీగా సైక్లిక్‌ కదలికలతో సంబంధం లేని రక్షణాత్మక రంగాలను ఎంచుకోవాలని పేర్కొంది. కొత్త ఏడాదిలో రియల్టీ, తదనుబంధ రంగాలు జోరు చూపుతాయని తెలిపింది. అంతర్జాతీయంగా యూరప్‌ ఇన్వెస్టర్లు ఇప్పటికీ భారత్‌పై అప్రమత్తంగానే ఉన్నారని తెలిపింది. 
లార్జ్‌క్యాప్‌ సిఫార్సులు: ఐటీసీ, యస్‌బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌.
మిడ్‌క్యాప్‌ సిఫార్సులు: ఫోనిక్స్‌ మిల్స్‌, మిండా, ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్'‌, ఉజ్జీవన్‌, అపోలో హాస్పిటల్స్‌, ఎన్‌సీసీ, క్రాంప్టన్‌, ఏసీసీ, బర్జర్‌ పెయింట్స్‌. 

 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Tuesday 26th March 2019

మార్కెట్‌ లాభాలకు బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ  తోడ్పాటునిస్తుంది. ట్రేడింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో చెప్పుకోదగ్గ కోనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సెక్టార్‌లో అధిక వెయిటేజీ గల ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు ర్యాలీ ఇండెక్స్‌ ఆయా ఇండెక్స్‌లను పరుగులెత్తించాయి. గతరెండు రోజులుగా మార్కెట్‌ భారీ పతనంలో

ఈ కౌంటర్లలో నెగిటివ్‌ సంకేతాలు

Tuesday 26th March 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు వాడే ఎంఏసీడీ ఇండికేటర్‌ ఆధారంగా షేరు కదలికలను పరిశీలిస్తుంటారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌

Most from this category