STOCKS

News


నిఫ్టీ ఏడాది టార్గెట్‌ 12,000!

Wednesday 19th September 2018
Markets_main1537345966.png-20383

మాక్క్వైరీ
భారత సైక్లిక్‌ రికవరీ విస్తృతమవుతోందని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం మాక్కై‍్వరీ అభిప్రాయపడింది. తాజాగా నిఫ్టీ ఏడాది టార్గెట్‌ను మాక్కై‍్వరీ 12,000 పాయింట్లకు పెంచింది. 2020 ఎర్నింగ్స్‌ అంచనాలకు ఈ టార్గెట్‌ 16.6 రెట్లు అధికం.  ఇన్‌ఫ్రాలో క్రమానుగత మార్పు కనిపిస్తోందని, రియల్టీ సంధికాలంలో ఉందని మాక్కై‍్వరీ తెలిపింది. ఎకానమీలో స్థూల ఆర్థిక సమస్యలు కాస్త పెరిగాయని, కానీ ఆందోళన చెందే స్థాయికి రిస్కుల్లేవని తెలిపింది. ట్రేడ్‌వార్‌, రూపీ క్షీణత, చమురు ధరల పెరుగుదల.. ఇటీవల కాలంలో మార్కెట్‌ను కుంగదీస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూలాలు మెరుగుపడుతుండడంతో కరెక‌్షన్‌ భారీగా కనిపించడం లేదు. దేశీయ సూచీల్లో వాల్యూషన్‌ ఇబ్బంది తక్కువేనని మాక్కై‍్వరీ అభిప్రాయపడింది. అయితే మిడ్‌క్యాప్స్‌ మాత్రం ఇంకా దుర్భలంగానే ఉన్నాయని అంచనా వేసింది. బ్యాంక్‌, మెటల్‌ రంగాలపై న్యూట్రల్‌గా ఉన్నామని, సిమెంట్‌, రియల్టీ, పారిశ్రామికం, ఐటీ, ఆటో రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామని బ్రోకరేజ్‌ సంస్థ వెల్లడించింది. 

 



You may be interested

భారీగా పతనమైన మిడ్‌క్యాప్స్‌ను కొనొచ్చు!

Wednesday 19th September 2018

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ దేశీయ మార్కెట్లో ఈ ఏడాది చిన్న స్టాకులు భారీగా కుదేలయ్యాయి. 2011 తర్వాత స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. అయితే చాలా ఫండ్స్‌ ఇప్పటికీ చిన్న స్టాకులను తమ పోర్టుఫోలియోలో చేర్చుకుంటునే ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ ఉన్నట్లుండి అనూహ్య లాభాలు ఇస్తాయన్న నమ్మకం మార్కెట్లో ఉందని తెలిపింది. దీర్ఘకాలిక సంపద కోసం వీటిలో పెట్టుబడులు  పెట్టడం మంచిదని సలహా

మెటల్‌ షేర్ల హవా..!

Wednesday 19th September 2018

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం మిడ్‌ సెషన్‌ సమయానికి మెటల్‌ షేర్ల హవా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న మెటల్‌ షేర్ల ర్యాలీలో భాగంగా నేటి ఇంట్రాడేలో మెటల్‌ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు రూపాయి పతనాన్ని నివారించే చర్చల్లో భాగంగా స్టీల్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర స్టీల్‌ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం 5 శాతం నుంచి 12.5 శాతంగా ఉన్న  స్టీల్‌ ఉత్పత్తులపై

Most from this category