STOCKS

News


యస్‌ బ్యాంకుపై ఇప్పటికీ జేపీ మోర్గాన్‌, మాక్వేర్‌ సానుకూలమే

Thursday 27th September 2018
Markets_main1537988142.png-20608

యస్‌ బ్యాంకు చీఫ్‌ రాణాకపూర్‌ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి వరకే పరిమితం చేస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం తర్వాత షేరు కుదేలైంది. ఈ నెల 25న జరిగిన యస్‌ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆర్‌బీఐ ఆదేశాలను అంగీకరించడంతోపాటు... రాణా కపూర్‌ పదవీకాలాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు మూడు నెలల పాటు పొడిగింపు ఇవ్వాలంటూ ఆర్‌బీఐని కోరాలని నిర్ణయించింది. దీంతో కొత్త సారధిని ఎంపిక చేసుకునేందుకు వీలు చిక్కుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫలితాలను ఆడిట్‌ చేసే ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకులో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉన్న రజత్‌ మోంగా, ప్రలే మోండల్‌ను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా నియమించాలని, దీర్ఘకాల వారసత్వ ప్రణాళికను వీరు ఖరారు చేస్తారని బ్యాంకు ప్రకటించింది. కాగా, బోర్డు నిర్ణయాల అనంతరం ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు మాక్వేర్‌, జేపీ మోర్గాన్‌ యస్‌ బ్యాంకు షేరు పట్ల సానుకూల రేటింగ్‌ను కొనసాగిస్తూ ప్రకటన జారీ చేశాయి. 


యస్‌ బ్యాంకుకు మాక్వేర్‌ అవుట్‌ పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌ ఇచ్చి టార్గెట్‌ ధర రూ.425ను ఇచ్చింది. అయితే, బ్యాంకుపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో రాణా కపూర్‌ పదవీ కాలం పొడిగింపు అభ్యర్థనను ఆర్‌బీఐ ఆమోదించకపోవచ్చని ఈ సంస్థ అభిప్రాయపడింది. బ్యాంకు బోర్డుకు సంబంధించిన వ్యక్తులు బ్యాంకు కార్యకలాపాల విషయంలో సమాన బాధ్యత వహిస్తారు కనుక వారిని ఆర్‌బీఐ ఆమోదించకపోవచ్చని పేర్కొంది. రాణా కపూర్‌ పదవీ కాలాన్ని ఆర్‌బీఐ సమీక్షించకపోవచ్చని, ఆర్‌బీఐ సూత్రాలకు విరుద్ధంగా యస్‌ బ్యాంకు కొనసాగింపు కారణం ఉన్నట్టు తెలిపింది. ‘‘మధు కపూర్‌, ఆర్‌బీఐ ఈ రెండూ రజత్‌ మోంగా, ప్రలే మోండల్‌ను ఈడీలుగా ఆమోదించాల్సి ఉంటుంది. యాజమాన్యం విషయంలో ఉన్న అనిశ్చితిని తొలగించేందుకు బోర్డు సమావేశం ప్రయత్నించలేకపోయింది’’ అని మాక్వేర్‌ పేర్కొంది.  జేపీ మోర్గాన్‌ సైతం యస్‌ బ్యాంకు షేరుకు ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చింది. రూ.400ను టార్గెట్‌గా పేర్కొంది. బ్యాంకు బోర్డు నిర్ణయాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. వారసత్వ ప్రణాళికలో స్పష్టత లోపించినట్టు అభిప్రాయపడింది. అయితే, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ మాత్రం అండర్‌ పెర్‌ఫార్మ్‌ రేటింగ్‌తో పాటు టార్గెట్‌ ధరగా రూ.230ను ఇవ్వడం గమనార్హం. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పైకి

Thursday 27th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:38 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 33 పాయింట్ల లాభంతో 11,085 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11,062 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా

ఎన్‌బీఎఫ్‌సీ విభాగంపై సానుకూలంగా ఉన్నాం: మ్యాక్స్‌లైఫ్‌

Thursday 27th September 2018

ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌ గత కొన్ని సెషన్లలో తీవ్రంగా నష్టపోయినప్పటికీ పలువురు నిపుణులు మాత్రం ఆయా కంపెనీలపై దీర్ఘకాలానికి సానుకూల ద్పక్పథాన్నే వ్యక్తపరుస్తున్నారు. ‘‘నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) కరెక్షన్‌ అన్నది కేవలం రేటింగ్‌ డౌన్‌ గ్రేడ్‌, విశ్వాసం కోల్పోవడం వల్ల జరిగిందే. అంతేకానీ, ఫండమెంటల్స్‌ పరంగా ఎన్‌బీఎఫ్‌సీ విభాగంపై మేం సానుకూలంగానే ఉన్నాం. అవి విస్తరించిన క్రమం, ప్రతీది తనకంటూ ప్రత్యేకమైన విభాగంలో కీలకంగా ఉండడంతో మార్జిన్లను నిలబెట్టుకోగలవు’’

Most from this category