STOCKS

News


మిడ్‌క్యాప్‌లో దిద్దుబాటు కొనసాగుతుంది: మాక్వేర్‌

Tuesday 16th October 2018
Markets_main1539630014.png-21174

మిడ్‌క్యాప్‌ విభాగంలో కరెక్షన్‌ కొనసాగుతుందని అంతర్జాతీయ ఈక్విటీ రీసెర్చ్‌ సంస్థ మాక్వేర్‌ క్యాపిటల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. నిధుల వ్యయాలు పెరుగుతండడమే కారణమని పేర్కొంది. వచ్చే రెండేళ్ల పాటు ఎన్నో అంశాల కారణంగా నిధుల వ్యయాలు అంతర్జాయంగా పెరుగుతాయని, ఇవి స్టాక్‌ విలువలపై ప్రభావం చూపిస్తాయని మాక్వేర్‌ క్యాపిటల్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ హెడ్‌ సందీప్‌ భాటియా పేర్కొన్నారు. అయితే, ఆదాయాల్లో రికవరీ ఈ ప్రతికూల ప్రభావానికి నిరోధంగా నిలుస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. పలు రంగాలపై అభిప్రాయాలను ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాటియా వివరించారు. 

 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
అమెరికాలో బలమైన వ్యాపారం కలిగిన ఐటీ కంపెనీలపై మంచి ప్రభావం ఉంటుందన్నారు. ఐటీ కంపెనీ ఆదాయాలు 14-15 శాతం స్థాయిలో వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కొన్ని సానుకూల ఆశ్చర్యపరిచే అంశాలకూ అవకాశం లేకపోలేదన్నారు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పట్ల ఈ రంగంలో తాము ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు.
వినియోగం
పండుగల సీజన్‌ కారణంగా ఉండే డిమాండ్‌ వినియోగ రంగ స్టాక్స్‌పై ప్రభావం చూపిస్తుందని మాక్వేర్‌ భావిస్తోంది. ఐటీసీ ఆకర్షణీయంగా ఉన్నట్టు భాటియా చెప్పారు. వేతన పెంపు ప్రభావం కూడా ఉంటుందన్నారు. కొన్ని నెలల ఒత్తిళ్ల అనంతరం సిగరెట్ల వ్యాపారం తిరిగి వృద్ధి బాటలోకి వచ్చిందని తెలిపారు.
ఫైనాన్షియల్స్‌
బ్యాంకింగ్‌ రంగంలో పెద్దవి, మంచి పేరున్న సంస్థలను సూచించారు. ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో కరెక్షన్‌ ఇంకా పూర్తి కాలేదని, నిధుల సమీకరణ వ్యయాలు ఎన్‌బీఎఫ్‌సీలకు సమస్య అని, ఇది రానున్న 12 నెలల కాలంలో వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని భాటియా వివరించారు. 
మారుతి సుజుకీ
ఈ స్టాక్‌ పట్ల మాక్వేర్‌ సానుకూలంగా ఉంది. ఈ స్టాక్‌లో కరెక్షన్‌ చోటు చేసుకుంటే అది కొనుగోలుకు చక్కని అవకాశమని భాటియా పేర్కొన్నారు. దశాబ్దకాలంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా మారుతి నిలిచిందని, ప్రపంచంలో భారత్‌ మార్కెట్‌ కోసమే పనిచేస్తున్న ఏకైక కార్ల సంస్థగానూ అభివర్ణించారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Tuesday 16th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 2 పాయింట్ల నష్టతో 10,517 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,517 పాయింట్లతో పోలిస్తే సమానంగా ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా లాభాల్లో లేదా నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో పెట్టుబడి అవకాశాలు: బీఎన్‌పీ

Tuesday 16th October 2018

ఇటీవల బాగా దిద్దుబాటుకు గురైన స్టాక్స్‌లో వృద్ధి అవకాశాలున్న కొన్నింటిలో బీఎన్‌పీ పారిబాస్‌ ఇన్వెస్ట్‌ చేసింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లకు అవకాశాలున్నట్టు ఈ సంస్థ తెలిపింది. లిక్విడిటీ కఠినతరం, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో బీఎస్‌ఈ ఫైనాన్స్‌ ఇండెక్స్‌ గత నెలలో 13 శాతం పతనమైన విషయం తెలిసిందే. ప్రైవేటు బ్యాంకులు, జీవిత బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ను నిర్వహించే అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల ఆస్తులు... వచ్చే ఏడాది పాటు కాల

Most from this category