STOCKS

News


ఈ షేర్లలో బేరిష్‌ సంకేతాలు!

Tuesday 9th July 2019
Markets_main1562662979.png-26924

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
బేరిష్‌ క్రాసోవర్‌
సోమవారం ముగింపు ప్రకారం 181 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిండాల్కో, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సెయిల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, సిప్లా, అంబుజా సిమెంట్స్‌, ఓబీసీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఐబీ రియల్టీ తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ షేర్లలో బుల్లిష్‌ సిగ్నల్స్‌
మరోవైపు 17 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో యస్‌బ్యాంక్‌, ధనలక్ష్మి బ్యాంక్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌, బీఎఫ్‌ యుటిలిటీస్‌, సొనాటా, ఏగిస్‌ లాజిస్టిక్స్‌, చోళమండలమ్‌ ఫైనాన్స్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌, ఆల్కెమ్‌ ల్యాబ్‌, హట్సన్‌ ఆగ్రో, బీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ తదితరాలున్నాయి.ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 



You may be interested

కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న మార్కెట్‌

Tuesday 9th July 2019

వరుసగా మూడో రోజు నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు మిడ్‌సెషన్‌ సమయానికి పరిమితమయ్యాయి. ఉదయం సెషన్‌లో జరిగిన అమ్మకాలతో సెన్సెక్స్‌ ఒకదశలో 285 పాయింట్లు క్షీణించి 38,435.87 వద్ద స్థాయికి చేరకోగా, నిఫ్టీ ఇండెక్స్‌ 91 పాయింట్లను కోల్పోయి 11,461.00 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అనంతరం కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోలుకు పూనుకోవడటం, ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగవడంతో సూచీలు కనిష్టస్థాయిల నుంచి రికవరి

రికవరి బాటలో బ్యాంకు నిఫ్టీ

Tuesday 9th July 2019

మార్కెట్‌ రికవరిలో భాగంగా మిడ్‌సెషన్‌ సమయానికి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ తిరిగి కోలుకుంది. ఎన్‌ఎస్‌ఈలో  బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ నేడు 11,531.60ల స్థాయి వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్‌లో మార్కెట్‌ పతనంలో భాగంగా దాదాపు 1శాతం క్షీణించి 30346.70 స్థాయికి పతనమైంది. అనంతరం మార్కెట్లో జరిగిన షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి(30346.70)

Most from this category