STOCKS

News


30 స్టాకుల్లో ఎంఎసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌!

Tuesday 7th August 2018
Markets_main1533627291.png-19011

దేశీయ సూచీలు ర్యాలీ మూడ్‌లో ఉన్నాయి. బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 30 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఎక్సైడ్‌ బ్యాటరీస్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఎంఅండ్‌ఎం, తల్వాకర్స్‌, జుబిలాంట్‌ ఫుడ్‌సైన్సెస్‌, గృహ్‌ ఫైనాన్స్‌, జేఎంసీ ప్రాజెక్ట్స్‌, జేకుమార్‌ ఇన్‌ఫ్రా, కిరి ఇండస్ట్రీస్‌, అశోకా బుల్డ్‌కాన్‌, విపుల్‌, స్వాన్‌ ఎనర్జీ, సారేగమా ఇండియా, ఆర్‌పీపీ ఇన్‌ఫ్రా, సుప్రీమ్‌ఇండస్ట్రీస్‌, జైడస్‌ వెల్‌నెస్‌, ఎలెక్ట్రోథెర్మ్‌, హెల్త్‌కేర్‌గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 19 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో ఇండోకౌంట్‌ ఇండస్ట్రీస్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, కెన్‌ఫిన్‌హోమ్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, తెజస్‌నెట్‌వర్క్‌, ఎన్‌ఐఐటీ, త్రివేణీ టర్బైన్‌, గ్రావిటా ఇండియా తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 



You may be interested

పీఎన్‌బీ నష్టం @ రూ.940 కోట్లు

Tuesday 7th August 2018

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ రూ.940 కోట్ల నికర నష్టా‍న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.343 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే మార్కెట్‌ వర్గాల అంచనా కన్నా ఈ నష్టాలు తక్కువగా ఉండటం గమనార్హం. త్రైమాసికం పరంగా చూస్తే బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏఎలు 18.38 శాతం

నష్టాల బాటలో అదానీ షేర్లు

Tuesday 7th August 2018

ముంబై:- తొలి త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రం నమోదు కావడంతో మంగళవారం అదానీ గ్రూప్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో ఈ గ్రూప్‌ షేర్లలో అమ్మకాలకు తెరలేచింది. ఫలితంగా ఈ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 6 నుంచి 12శాతం నష్టపోయాయి. అదానీ పోర్ట్స్‌:- ఎన్‌ఎస్‌ఈలో 6.50శాతం నష్టపోయింది. తొలి త్రైమాసికంలో నికర లాభం 9శాతం క్షీణించింది. ఈ

Most from this category