STOCKS

News


ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచిన స్టాకులివే!

Monday 27th August 2018
Markets_main1535348723.png-19676

దేశీయ సూచీలు సోమవారం మరో ఆల్‌టైమ్‌ హై నమోదు చేశాయి. మార్కెట్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 45 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఓరియంట్‌ రిఫ్రాక్టరీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బీపీఎల్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్కలీ మెటల్స్‌, ఈయాన్‌ ఎలక్ట్రిక్‌, విమ్టాల్యాబ్‌, ధర్మపుర్‌సుగర్‌ మిల్స్‌, సర్దా ఎనర్జీ అండ్‌ మినరల్స్‌, ఉత్తమ్‌ సుగర్‌ మిల్స్‌, బాలాజీ టెలిఫిల్మ్స్‌, ఓరికాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌, వీఐపీ క్లాతింగ్‌, ఐటీడీ సిమెంటేషన్‌ ఇండియా, హెచ్‌ఓవీ సర్వీసెస్‌, కోల్టె పటీల్‌ డెవలపర్స్‌, కళ్యాణీ స్టీల్స్‌, జైడస్‌ వెల్‌నెస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడ్డ షేర్లివే...
మరోవైపు 33 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో ఆర్‌కామ్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, వోల్టాస్‌, దిలీప్‌ బుల్డ్‌కాన్‌, శ్రీరామ్‌ ఈపీసీ, అక్షర్‌కెమ్‌ ఇండియా, బజాజ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. 
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

సెన్సెక్స్‌ 370 పాయింట్లు ర్యాలీ

Monday 27th August 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఇండెక్స్‌లు పరుగులు పెడుతున్నాయి. 221 పాయింట్ల గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది. ఉదయం 11: 23 సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 370కి పైగా పాయింట్ల లాభంతో 38,628 ట్రేడవుతోంది. ఇక ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 108 పాయింట్ల లాభంతో 11,666 వద్ద ట్రేడవుతోంది. బ్యాకింగ్‌, మెటల్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా,

మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ మంచివేనా ? 

Monday 27th August 2018

ప్ర: మల్టీక్యాప్‌ ఫండ్స్‌ మంచివేనా? కాంట్రా, వేల్యూ ఫండ్స్‌తో పోల్చితే మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఏ విధంగా భిన్నమైనవి. ఈ మూడు రకాల ఫండ్స్‌లో దేంట్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు వస్తాయి? ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తే తగిన రాబడులు పొందవచ్చు? -సుమ, హైదరాబాద్‌  జ: మల్టీక్యాప్‌, కాంట్రా, వేల్యూ- ఈ మూడు రకాల ఫండ్స్‌ మంచివే. ఈ ఫండ్స్‌లో కనీసం 5-6 ఏళ్లు ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈ

Most from this category