STOCKS

News


ఈ షేర్లలో ఎంఏసీడీ నెగిటివ్‌ క్రాసోవర్‌

Wednesday 29th August 2018
Markets_main1535524819.png-19758

దేశీయ సూచీలు ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో అడ్వాన్స్‌ డిక్లైన్‌ నిష్పత్తి క్రమంగా బేర్స్‌కు అనుగుణంగా కనిపిస్తోంది. మంగళవారం ముగింపు ప్రకారం 32షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారినకంపెనీల్లో పీసీ జువెల్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పీటీసీ ఇండియా, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, హెచ్‌యూఎల్‌, మీర్జా ఇంటర్నేషనల్‌, ఏసీసీ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు పలు షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, జైన్‌ ఇరిగేషన్‌, జైపీ పవర్‌, ట్రైడెంట్‌, వీగార్డ్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, మదర్‌సన్‌ సుమి, బీఎంఎల్‌, ఉజ్జీవన్‌ ఫిన్‌సర్వ్‌, ఇజ్మో, రామ్‌కో ఇండస్ట్రీస్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

నిఫ్టీ ఇండెక్స్‌ స్టాక్స్‌: బంపర్‌ రిటర్న్స్‌

Wednesday 29th August 2018

దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియాపై తొలినాళ్లలో ఎవరైతే విశ్వాసముంచి స్టాక్స్‌ కొనుగోలు చేసి ఉంటారో.. వారిప్పుడు అదిరిపోయే రిటర్న్స్‌ను సొంతం చేసుకొని ఉంటారు. 2003 జూలైలో లిస్టైన ఈ స్టాక్‌ గత 15 ఏళ్లలో ఏకంగా 5,400 శాతానికిపైగా ర్యాలీ చేసింది. ఈ స్టాక్‌ 2004లో నిఫ్టీ-50 క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం మైలురాయిగా చెప్పుకోవచ్చు. మారుతీ తర్వాత మార్కెట్‌లో లిస్టైన మరో 12 స్టాక్స్‌ కూడా

40 షేర్లు.. 52వారాల కనిష్టానికి...

Wednesday 29th August 2018

ముంబై:- ఆసియా మార్కెట్ల నుంచి అందతున్న మిశ్రమ ఫలితాల నేపథ్యంలో బుధవారం ఉదయం దేశీయ మార్కెట్‌ పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.11:30ని.లకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 38898 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్పనష్టంతో 11,734 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మార్కెట్‌ బడిదుడుకుల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో 40 షేర్లు 52-వారాల కనిష్టానికి పతనయ్యాయి. వాటిలో కామ్లిన్‌ ఫిన్‌ సైన్సెన్స్‌, ధనలక్ష్మీ బ్యాంకు, ఈ-క్లారెక్స్‌ సర్వీసెస్‌,

Most from this category