STOCKS

News


ఈ షేర్లు ర్యాలీకి రెడీ!

Wednesday 3rd October 2018
Markets_main1538550406.png-20820

ఎంఎసీడీ సంకేతాలు
మంగళవారం ముగింపు ప్రకారం 17 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, హెచ్‌యూఎల్‌, టాటా కమ్యూనికేషన్స్‌, ఎల్‌అండ్‌టీ ఫుడ్స్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, సైయంట్‌, డీబీ కార్‌‍్ప, అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌, ప్రెసిషన్‌ కామ్‌షాఫ్ట్స్‌, ఇజ్మో, పొద్దర్‌ హౌసింగ్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 25 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో యునైటెడ్‌ బ్రూవరీస్‌, డీసీఎం శ్రీరామ్‌, లిండె ఇండియా, టీమ్‌లీస్‌ సర్వీసెస్‌, సెరా శానిటరీ, ఫినోలెక్స్‌ కేబుల్స్‌, సింఫనీ, క్రిసిల్‌, ఆదిత్య బిర్లా నువో, ఖైతాన్‌ ఎలక్ట్రికల్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. 
మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 

 You may be interested

టెల్కోల బాధలు తప్పేలా లేవు..

Wednesday 3rd October 2018

జియో నుంచి ధరల పోటీ కొనసాగుతుండటం వల్ల టెలికం కంపెనీలు రానున్న త్రైమాసికంలోనూ బలహీన ఎర్నింగ్స్‌ను ప్రకటించొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేశారు. ‘భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ సహా వైర్‌లెస్‌ సేవలందించే టెల్కోల ఎర్నింగ్స్‌ వచ్చే త్రైమాసికంలోనూ ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పోస్ట్‌పెయిడ్‌ రి-ప్రైసింగ్‌, ప్రిపెయిడ్‌ ఏఆర్‌పీయూ తగ్గుతూ రావడం, జియో ఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ వల్ల కంపెనీల రెవెన్యూ తగ్గొచ్చు. వొడాఫోన్‌-ఐడియా టెనన్సీ ముగింపు వల్ల భారతీ ఇన్‌ఫ్రాటెల్‌పై నెగటివ్‌

నష్టాల మార్కెట్‌లో మెటల్‌ షేర్ల మెరుపులు

Wednesday 3rd October 2018

ముంబై:- మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., బుధవారం మెటల్‌ షేర్లు మాత్రం లాభాల బాట పట్టాయి. నాఫ్టా ఒప్పందంలో భాగంగా అమెరికా, కెనడా దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో మంగళవారం ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్లు భారీగా ర్యాలీ చేశాయి. ఆ ర్యాలీని అందుకున్న దేశీయ మెటల్‌ షేర్లు నేటి ఇంట్రాడేలో లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ

Most from this category