News


106 కౌంటర్లు బలహీనం

Tuesday 25th September 2018
Markets_main1537873749.png-20564

సూచిస్తున్న ఎంఏసీడీ
దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 106 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో సుజ్లాన్‌, బలరామ్‌ పూర్‌చిని, టాటా స్టీల్‌, హాత్‌వే, జిందాల్‌ స్టెయిన్‌లెఽస్‌, కాస్ట్రాల్‌, ఎంటీఎన్‌ఎల్‌, మేఘమణి ఆర్గానిక్స్‌, మెర్కాటర్‌, గ్రాసిం, గృహ్‌ఫైనాన్స్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 3 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. టీసీఎస్‌, టీడీ పవర్‌ సిస్టమ్స్‌, ఓస్వాల్‌ ఆగ్రో మిల్స్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

11080 పైన క్లోజయితే 11171 పాయింట్లకు నిఫ్టీ

Tuesday 25th September 2018

మంగళవారం దేశీయ సూచీలు లాభనష్టాల నడుమ ఊగిసలాడి చివర్లో మంచి లాభాలతో క్లోజయ్యాయి. నిఫ్టీ 10880 పాయింట్లను తాకి చివరకు 11070 పాయింట్ల వద్ద క్లోజయింది. చివరి గంటలో సూచీల్లో మంచి బలమైన రికవరీ కనిపించింది. చార్టుల్లో పియర్సింగ్‌ లైన్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. ఐదు సెషన్ల తర్వాత సూచీలు తొలిసారి లాభపడ్డాయి. బుధవారం నిఫ్టీ తన పరుగు కొనసాగించాలంటే 11080 పాయింట్లపైన బలంగా నిలదొక్కుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో

ఆగస్టులో ఆచితూచి కొనుగోళ్లు చేసిన ఎంఎఫ్‌లు

Tuesday 25th September 2018

దేశీయ ఫండ్‌ మేనేజర్లు ఆగస్టులో ఆచితూచి నాణ్యమైన స్టాకులను కొనుగోలు చేసినట్లు గణాంకాలు చూపుతున్నాయి. నిజానికి ఆగస్టు నెలలో కేవలం కొన్ని స్టాకులు తప్ప ఇతర స్టాకులన్నీ నేల చూపులు చూశాయి. అయితే కొన్ని మంచి కంపెనీల స్టాకుల్లో ఎంఎఫ్‌లు వాటాలు పెంచుకున్నాయి. - అదానీ పోర్ట్స్‌: గత జూలైతో పోలిస్తే ఆగస్టులో ఎంఎఫ్‌ల వాటా 15.4 శాతం మేర పెరిగింది.  - ఐటీసీ: ఎంఎఫ్‌లు వాటాను 11.9 శాతం మేర పెంచుకున్నాయి.  -

Most from this category