STOCKS

News


లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌గెయిన్‌ టాక్స్‌ ఎత్తేస్తారా?!

Tuesday 25th June 2019
Markets_main1561459316.png-26568

రాబోయే బడ్జెట్లో లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌(ఎల్‌టీసీజీ)ను పూర్తిగా ఎత్తేయడం లేదా కొంతమేర తగ్గించడమో చేయవచ్చని మార్కెట్‌ వర్గాలు ఆశిస్తున్నాయి. జూలై 5న కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎల్‌టీసీజీ నుంచి ఉపశమనం లభిస్తే క్యాపిటల్‌ మార్కెట్లు మరలా ఉత్తేజం పొందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్లో ఎక్కువమంది ఎల్‌టీసీజీ పూర్తిగా తీసివేస్తారని భావిస్తుండగా, కొందరు మాత్రం మినహాయింపు పరిమితిని లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచుతారని భావిస్తున్నారు. ఎల్‌టీసీజీని ప్రవేశపెట్టడం వల్ల పన్ను ఆదాయాల్లో పెద్దగా వచ్చిన పాజిటివ్‌ మార్పులేమీ లేవని అంబరీశ్‌ బాలిగా వ్యాఖ్యానించారు. అలాగని ఈ పన్నును పూర్తిగా తీసివేయకపోవచ్చన్నారు. ఎల్‌టీసీజీని ప్రస్తుతం తొలగిస్తే గతంలో ప్రవేశపెట్టి తప్పు చేసినట్లు ప్రభుత్వం ఒప్పుకున్నట్లయితుందని, అందుకే దీన్ని పూర్తిగా ఎత్తేయరని చెప్పారు. పైగా ఇది ప్రవేశపెట్టి కేవలం ఏడాదైందని, అందువల్ల దీన్ని మరికొంత కాలం కొనసాగిస్తారని తెలిపారు. కానీ ధృవ్‌ అడ్వైజర్స్‌ ప్రతినిధి పునీత్‌ షా మాత్రం దీన్ని పూర్తిగా తొలగిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ పన్ను పునఃవిధించడం విదేశీ ఇన్వెస్టర్లకు చికాకు తెప్పించిందని, దీనివల్ల పెద్దగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తెలిపారు. ఇప్పటికే ఎస్‌టీటీ చెల్లిస్తుంటే, కొత్తగా ఎల్‌టీసీజీ అనవరంగా తెచ్చారని దేవాన్‌ చౌక్సీ వ్యాఖ్యానించారు. దీనితో రెండు సార్లు పన్ను విధించినట్లవుతుందన్నారు. ఇది ఒక తిరోగామి చర్యని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎండి ఆశిష్‌ సోమయ్యా చెప్పారు. ఇది పన్నుల్లో బహుళత్వానికి నిదర్శనమి, దీనివల్ల ఇన్వెస్టర్లకు ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు డౌన్‌

Wednesday 26th June 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలత కారణంగా బుధవారం భారత్‌ మార్కెట్‌ నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.45 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు క్షీణించిం‍ది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,765 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూన్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,810 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌,

52 వారాల కనిష్టానికి 200 షేర్లు

Tuesday 25th June 2019

బీఎస్‌ఈలో  204 స్టాక్‌లు తాజా ట్రేడింగ్‌లో ఏడాది కనిష్ఠాన్ని తాకాయి. గ్లెన్‌మార్క్‌ పార్మా, మెక్‌ లియోడ్‌ రస్సెల్‌, ఈరోస్‌ మీడియా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఇమామి, టీవీఎస్‌ మోటర్‌, హెచ్‌టీ మీడియా, గాబ్రియల్‌ ఇండియా వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి. 

Most from this category