పాత తప్పిదాలే పుట్టి ముంచుతాయి
By D Sayee Pramodh

ఆగస్టు నుంచి ఆరంభమైన సంక్షోభం ధాటికి దేశీయ మార్కెట్లలో దాదాపు 17 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. చిన్న ఇన్వెస్టర్ల నుంచి బడా హౌస్లవరకు అందరికీ ఈ దఫా గట్టి దెబ్బే తగిలింది. అయితే మార్కెట్లో దెబ్బలకు మన సొంత తప్పిదాలే అధిక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ చేసే తప్పులే మనకు తెలియకుండా రిపీట్ చేస్తుంటామని చెబుతున్నారు.
తాజా పతనంలో ఏమి నేర్చుకోవాలి...
- ‘రోమ్ ఒక్కరోజులో నిర్మితం కాలేదు.. కానీ హిరోషిమా, నాగసాకి ఒక్క రోజులో ధ్వంసం అయ్యాయి...’ దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉందని ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా చెబుతున్నారు. మార్కెట్లో కూడబెట్టేందుకు చాలా కాలం పట్టవచ్చు, కానీ ఊడ్చిపెట్టుకుపోయేందుకు ఒక్క రోజు చాలు. ఈ విషయం ఎక్కువ మంది చెవికి ఎక్కదని ఆయన చెప్పారు. దీర్ఘకాలిక ధృక్పథంతో మార్కెట్లో ఉంటేనే కాసులు వస్తాయి కానీ ఒక్కరోజులో కోట్లు రావాలంటే ఉన్నది కూడా పోతుందని ఆయన హెచ్చరించారు.
- క్లోనింగ్ చేస్తే ప్రయోజనం ఉండదని ఈ పతనంలో చాలా మందికి తెలిసివచ్చి ఉంటుంది. ప్రముఖ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలను గుడ్డిగా అనుకరించడం ఎక్కువ మంది చేస్తుంటారు. నిజానికి ప్రముఖ ఇన్వెస్టర్ల ఆలోచనను ఫాలో కావాలి కానీ వాళ్ల పోర్టుఫోలియోలను కాదు. బడా ఇన్వెస్టర్లు నష్టం వచ్చినా తట్టుకోగలరు, కానీ సామాన్య ఇన్వెస్టర్ సోయలో లేకుండా పోతాడు. ఉదాహరణకు తాజా కరెక్షన్లో రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పోర్టుఫోలియో పతనాన్ని గమనించవచ్చు.
- అధ్యయనం లేని పెట్టుబడి.. ఇది ఎక్కువమంది చేసే తప్పు. స్టాక్ టిప్స్నో, పక్కవాడిని చూసో, మనసుకు నచ్చిందనో షేరు కొనేవాళ్లు మార్కెట్లో ఎక్కువగా ఉంటారు. ఒక కంపెనీ షేరు తీసుకునే ముందు అసలా కంపెనీ వ్యాపారమేంటి? ఎలా నడుస్తోంది? లాంటి అధ్యయనాలు చేసే ఓపిక మనవాళ్లకు చాలా తక్కువ. ఎక్కువగా చిన్న స్టాకుల్లో మల్టీబ్యాగర్ రిటర్న్స్' ఆశిస్తూ పెట్టుబడులు పెడుతుంటారు. ఇలా పెట్టినవాళ్లలో చాలమందిని ఈ దఫా పతనం కాటేసింది.
- టాప్, బాటమ్ తెలిసినవాళ్లిద్దరే.. ఒకరు దేవుడు ఇంకొకరు అబద్ధాల కోరు. అంటే మార్కెట్లో టాప్, బాటమ్ ఎవరూ కచ్ఛితంగా ఊహించలేరు. ఎవరైనా అలా చెప్పారంటే ఇందాకటి ఇద్దరులో వాళ్లు ఒకరని అర్ధం. భారీ ర్యాలీ తర్వాత భయంకర పతనం సాధారణం. మార్కెట్లు టాప్, బాటమ్ అవుట్ అయిన సంకేతాలు ఒక్కరోజులో అర్ధం కావు. సమయానుగుణ అధ్యయనం చేస్తుంటే అప్పుడు గుర్తించవచ్చు. చాలా మంది ఇన్వెస్టర్లు తాజా పతనంలో 10860 పాయింట్లను దాటి నిఫ్టీ కిందకు రాకపోవచ్చని తెగ లెక్కలు చెప్పారు. వాళ్లందరి ఆశలూ ఆవిరి చేస్తూ నిఫ్టీ 10500 పాయింట్లను కూడా కోల్పోయింది.
- వాల్యూషన్లే శాసిస్తాయని అంతా చెబుతారు కానీ తక్కువమంది ఫాలో అవుతారు. ఉదాహరణకు ఆగస్టు ర్యాలీని గమనిస్తే కొన్ని స్టాకుల మద్దతుతో సూచీలు పెరిగాయి. దీంతో సదరు స్టాకుల వాల్యూషన్లు కూడా పెరిగాయి. అలాంటి స్టాకులు తాజా పతనంలో భారీగా పడిపోతున్నాయి. రిలయన్సే ఇందుకు సరైన ఉదాహరణ.
You may be interested
కొచర్ ఎగ్జిట్.. ఐసీఐసీఐకి పాజిటివ్..
Friday 5th October 2018చందా కొచర్ బ్యాంక్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు ఐసీఐసీఐ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉన్నాయి. యూబీఎస్, మెక్వైరీ సహా పలు సంస్థలు ఈ స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగించాయి. ► చందా కొచర్ తప్పుకోవడం ఐసీఐసీఐ బ్యాంక్‌కు పాజిటివ్ అంశమని యూబీఎస్ పేర్కొంది. షేర్హోల్డర్లు ఇకపై కోర్ బ్యాంకింగ్ వ్యాపారంపై దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ టార్గెట్ ప్రైస్‌ను రూ.410 నుంచి రూ.440కి పెంచింది. లోన్ బుక్
పెట్రోమార్కెటింగ్ కంపెనీల డౌన్‌గ్రేడ్
Friday 5th October 2018బ్రోకరేజ్ సంస్థలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల స్టాక్స్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం గరువారం సాయంత్రం లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.2.50 తగ్గింపు ప్రకటించింది. రూ.2.50లో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు రూ.1.50 అయితే, మరో రూ.1 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గిస్తాయని పేర్కొంది. వ్యాట్ తగ్గింపును కలుపుకొని గుజరాత్, మహరాష్ట్ర రాష్ట్రాలు డీజిల్, పెట్రోల్ ధరలను లీటరుకు రూ.5 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వపు ప్రకటనతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు