STOCKS

News


వాల్యూ పిక్స్‌ కావాలా..

Saturday 20th April 2019
Markets_main1555756646.png-25247

క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌ను ఎంచుకోండి
నిపుణుల సలహా
గత కొన్నేళ్లుగా ప్రధాన మార్కెట్‌తో పోలిస్తే పేలవ ప్రదర్శన చూపుతున్న క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీల స్టాకులపై పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏబీబీ, సీమెన్స్‌, కమిన్స్‌ ఇండియా, థెర్మాక్స్‌ లాంటి క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాకుల వాల్యూషన్లు వాటి చారిత్రక సరాసరిల కన్నా తక్కువగా ఉన్నాయని, పెట్టుబడుల వలయం పుంజుకునే ఈ తరుణంలో ఇకపై ఈ కంపెనీలు సత్తా చూపుతాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే ఐదేళ్ల కాలపరిమితితో వీటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఎల్‌అండ్‌టీ, కల్పతరుపవర్‌, కేఈసీ, పాలీక్యాబ్‌ లాంటి షేర్లు లాంగ్‌టర్మ్‌కు మంచి పెట్టుబడి అవకాశాలని షేర్‌ఖాన్‌ తెలిపింది. స్థిర ప్రభుత్వం వచ్చే  ఛాన్సులు ఎక్కువగా ఉన్నందున ఇకపై ఇన్‌ఫ్రా, నిర్మాణం, విద్యుత్‌ తదితర రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌ వేగం పుంజుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం చాలావరకు క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాకులు తమ సరాసరి పీఈ కన్నా 20- 35 శాతం మేర తక్కువకు ట్రేడవుతున్నాయి. గత మూడేళ్లుగా వీటిలో చాలా స్టాకులు ఫ్లాట్‌ రాబడులు ఇచ్చాయి. క్యాపిటల్‌గూడ్స్‌ రంగంలోని కంపెనీలు వచ్చే రెండేళ్లకు దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించాయి. ఎన్నికల తర్వాత ఆర్డర్లు పెరుగుతాయని చాలా కంపెనీల మేనేజ్‌మెంట్లు ఆశావహంగా ఉన్నాయి. ఇప్పటికే రైల్వే రంగంలో ఆర్డర్లు ఊపందుకున్నాయని, సిమెంట్‌ రంగం పురోగతి చూపుతోందని ఆయా కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ ఎకానమీ రెండుమూడేళ్లుగా ఒడిదుడుకుల పయనం కొనసాగిస్తోంది. దీంతో పలు క్యాపిటల్‌గూడ్స్‌ కంపెనీలు అల్ప వృద్ధి నమోదు చేశాయి. కీలక రంగాల్లో మందగమనం కంపెనీల ఆర్డర్లను దెబ్బతీసింది. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితులు చక్కబడుతున్నాయి. You may be interested

మేలో మేజర్‌ స్పీడ్‌బ్రేకర్‌?!

Saturday 20th April 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌కు చెక్‌ పెట్టి మరలా పైకి ఎగిశాయి. ఈ వారం సరికొత్త ఆల్‌టైమ్‌హైని తాకాయి. అయితే వారం చివర్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ నమోదయింది. ఎన్నికల అస్పష్టత, వరుస సెలవల నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లు తగ్గించుకున్నారు. ప్రస్తుతం 11800 పాయింట్ల వద్ద భారీ పుట్‌రైటింగ్‌ పరిశీలిస్తే స్వల్ప అప్‌మూవ్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రైమరీ మార్కెట్లో మళ్లీ ఐపీఓల హవా ఆరంభమైంది. ఇవన్నీ మార్కెట్లో పాజిటివ్‌

పెట్టుబడులను రక్షించే వ్యూహమేంటి?

Saturday 20th April 2019

ఎన్నికల సందర్భంగా ఒకపక్క ఎఫ్‌ఐఐల నిధుల కుమ్మరింపు, మరోపక్క డీఐఐల అమ్మకాలతో మార్కెట్లో రిటైలర్‌కు ఎటూపాలుపోని స్థితి కనిపిస్తోంది. ఎఫ్‌ఐఐలు సాధారణంగా స్థిరప్రభుత్వం ఉన్న దేశాల మార్కెట్లలో పెట్టుబడులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. గతేడాది చివర్లో ప్రధాని మోదీకి జనాకర్షణ తగ్గినట్లు కనిపించింది, కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి చూసింది. దీంతో మార్కెట్లో భయాలు ఎక్కువయ్యాయి. గతంలోలాగా కిచిడీ ప్రభుత్వాలు వస్తాయన్న భయాలు మహాఘట్భంధన్‌తో మరింత పెరిగాయి. ఒకవేళ యూపీఏ

Most from this category