STOCKS

News


తక్కువ ధరల్లో ఎన్నో షేర్లు

Sunday 12th August 2018
Markets_main1534075261.png-19184

విలువైన స్టాక్స్‌ ఏవి? మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో చాలా వరకు షేర్లు నష్టపోయి తక్కువ ధరలకే లభిస్తున్న ఈ తరుణంలో పెట్టుబడులకు మంచి స్టాక్స్‌ ఏవన్న మీమాంసతో ఇన్వెస్టర్లు కొందరు ఉన్నారు. ఈ విధంగా చూసినప్పుడు 40 శాతం వరకు పతనమైన తక్కువ ధరలకు లభిస్తున్న కొన్ని వాల్యూ స్టాక్స్‌ ఉన్నాయంటున్నారు నిపుణులు. 

 

ప్రధాన సూచీలు కొత్త జీవిత శిఖరాలకు చేరినప్పటికీ మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాలు మాత్రం ఇంకా అమ్మకాల ఒత్తిళ్లలోనే ఉన్నాయి. వాటిల్లో రికవరీ తక్కువగా ఉంది. ‘‘దీర్ఘకాలంలో మన దేశ ఈక్విటీ మార్కెట్లకు మంచి భవిష్యత్తు ఉంది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వ్యవసాయంపై ఆదాయం పెరగడం ప్రైవేటు బ్యాంకులు, వినియోగ రంగాలకు సానుకూలం’’ అని షేర్‌ఖాన్‌ అడ్వైజరీ హెడ్‌ హేమంగ్‌జానీ పేర్కొన్నారు. మంచి ఆర్థిక మూలాలు ఉండి, చక్కని ఫలితాలను ప్రకటించిన కంపెనీల ధరల్లో రికవరీ మొదలైనప్పటికీ వాటి గత గరిష్ట స్థాయిలకు ఇంకా దూరంలో ఉన్నాయి. 

 

బీఎస్‌ఈ 500లో చౌక స్టాక్స్‌

బీఎస్‌ఈ 500లో రూ.10,000 కోట్లకు పైగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగి ఉన్న స్టాక్స్‌ను పరిశీలిస్తే 18 స్టాక్స్‌ 25-42 శాతం వరకు తక్కువ ధరకే లభిస్తున్నాయి. వాటిల్లో ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఒకటి. ఇది దాని గత గరిష్ట ధర రూ.1585 నుంచి 42 శాతం తక్కువలోనే (రూ.915) ట్రేడ్‌ అవుతోంది. ఆ తర్వాత సెంచరీ టెక్స్‌టైల్స్‌ దాని గత గరిష్ట ధర నుంచి 39 శాతం, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 33 శాతం, ఎస్‌జేవీఎన్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ షేర్లు సైతం 33 శాతం చొప్పున తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 42 శాతం చొప్పున, ఏబీబీ 31 శాతం, సుందరం ఫైనాన్స్‌ 29 శాతం, జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ 28 శాతం, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ 28 శాతం, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఏఎంసీ 27 శాతం తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ 26 శాతం చొప్పున, సన్‌టీవీ, పీఐ ఇండస్ట్రీస్‌, అశోక్‌ లేలాండ్‌, రామ్కో సిమెంట్స్‌ 25 శాతం చొప్పున వాటి గత గరిష్ట స్థాయిలతో పోలిస్తే తక్కువకు అందుబాటులో ఉన్నాయి.

 

రానున్న నెలల్లో లార్జ్‌క్యాప్‌కు, మిడ్‌క్యాప్‌నకు మధ్య అంతరం ముగిసిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘పెట్టుబడుల పరంగా కొన్ని స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఆకర్షణీయ విలువల వద్ద లభిస్తున్నాయి. 40-50 శాతం కరెక్షన్‌ చోటు చేసుకోవడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు విలువైన స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియో కోసం యాడ్‌ చేసుకునేందుకు మించి అవకాశాలు ఉన్నాయి’’అని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈవో ముస్తఫా నదీమ్‌ పేర్కొన్నారు.



You may be interested

ఫిజికల్‌ రూపంలో షేర్లను కలిగి ఉండొచ్చు: సెబీ

Sunday 12th August 2018

ఇన్వెస్టర్లు ఫిజికల్‌ పత్రాల రూపంలో షేర్లను కలిగి ఉండడంపై ఇన్వెస్టర్లలో సందేహాలు నెలకొనడంతో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వివరణ ఇచ్చింది. ఇన్వెస్టర్లు ఫిజికల్‌ రూపంలోనూ షేర్లను కలిగి ఉండొచ్చని స్పష్టం చేసింది. తమ నూతన మార్గదర్శకాలు డిసెంబర్‌ 5 తర్వాత ఇన్వెస్టర్లు ఫిజికల్‌ రూపంలో కలిగి ఉండడాన్ని నిషేధించడం లేదని పేర్కొంది. సెబీ ఇటీవలి మార్గదర్శకాల్లో స్పష్టత లోపించడంతో సెబీకి ఎంతో మంది ఇన్వెస్టర్ల నుంచి కాల్స్‌

సాగర్‌ సిమెంట్ షేరును కొనొచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

Saturday 11th August 2018

ముంబై:- దేశంలోని సిమెంట్‌ కంపెనీ షేర్లకు మంచి రోజులొచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన అందరికీ గృహవసతి కల్పన కార్యక్రమంతో పాటు పలు నిర్మాణ కార్యక్రమాలతో రానున్న రోజుల్లో నిర్మాణ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందనే అంచనా వేస్తుంది. ఉత్పత్తి భారీగా పెరుగుతుండంతో డిమాండ్‌ ఊపందుకోవడం, కంపెనీల అధిక వ్యయాల తగ్గింపునకు తగిన విధంగా వ్యూహరచనలు సిమెంట్‌ కంపెనీలను లాభాల బాట పట్టిస్తున్నాయని తెలిపింది. మరోవైపు ఈ

Most from this category