STOCKS

News


పడుతున్న స్టాక్స్‌ను కొన్నదెవరు..?

Wednesday 24th April 2019
Markets_main1556129046.png-25323

మార్చి త్రైమాసికంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు, హెచ్‌ఎన్‌ఐలు బాగా పడిపోతున్న స్టాక్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపించినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, ఫండమెంటల్స్‌లో మార్పులు, రుణాల భారం తదితర అంశాలతో పడిపోయే వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డారు. బాగా పడుతుండడంతో చౌక వ్యాల్యూషన్లు అని పొరబడ్డారా లేక భారీగా పడిన తర్వాత కొంత రికవరీ అయితే లాభాలు గడిద్దామనుకున్నారా... వారికే తెలియాలి. ఇలా వీరు ఆరాటం కొద్దీ కొన్న షేర్లలో జెట్ ఎయిర్‌వేస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తదితర షేర్లు ఉన్నాయి. 

 

బీఎస్‌ఈ-500 సూచీలోని 24 స్టాక్స్‌లో రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐల వాటా మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 14 కంపెనీలు ఏకంగా 85 శాతంలోపు పడిపోయాయి. పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్‌కామ్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా మార్చి క్వార్టర్లో ఏకంగా 14.4 శాతం పెరిగి 37.2 శాతానికి చేరింది. డిసెంబర్‌ త్రైమాసికంలో వీరి వాటా 22.8 శాతమే కావడం గమనార్హం. కంపెనీ ప్రమోటర్లు షేర్లను తనఖా పెట్టగా, ఈ షేర్లపై రుణాలిచ్చిన యాక్సిస్‌ ట్రస్టీ సర్వీసెస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఓపెన్‌ మార్కెట్లో విక్రయించాయి. ప్రమోటర్ల వాటా క్రితం త్రైమాసికంలో 53.08 శాతం నుంచి 21.97 శాతానికి తగ్గిపోయింది. అనిల్‌ అంబానీ గ్రూపులోని మరో కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సైతం తన మార్కెట్‌ క్యాప్‌లో మూడింట రెండొంతులు కోల్పోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీలో చిన్న ఇన్వెస్టర్ల వాటా 4.7 శాతం పెరిగింది. అంతక్రితం త్రైమాసికంలో ఉన్న 9.7 శాతం నుంచి 14.4 శాతానికి పెరిగింది. 

 

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లోనూ ఇదే పరిస్థితి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ కొరతతో హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల షేర్లు పడిపోయాయి. ఆ తర్వాత ఈ కంపెనీ అక్రమంగా నిధులను రుణాల రూపంలో దారి మళ్లించిందన్న కోబ్రాపోస్ట్‌ వార్తతో మరింత కకావికలంగా మారిపోయింది. హెచ్‌ఎన్‌ఐలు, రిటైలర్లు కలసి 6.4 శాతం వాటా పెంచుకున్నారు. 21.4 శాతం నుంచి 27.8 శాతానికి పెరిగింది. ఈ షేరు ఒక్కసారిగా పతనం కావడంతో చాలా మంది ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. ‘‘షేరు ధర పతనం కానంత వరకు కంపెనీ వ్యాపార నమూనా చక్కగా ఉందని భావించాం. కానీ ఉత్తమ కార్పొరేట్‌ ప్రమాణాల్లేని కంపెనీలను మార్కెట్‌ శిక్షిస్తుంది’’ అని ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌కు చెందిన మహంతేష్‌ పేర్కొన్నారు. అయితే, కంపెనీ వ్యాపారం ఏ మాత్రం చెక్కచెదరలేదని, మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఇక రుణ భారంతో సంక్షోభంలోకి వెళ్లిన జెట్‌ ఎయిర్‌వేస్‌లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 1.2 శాతం పెరిగింది. అలాగే, హెచ్‌ఈజీ స్టాక్‌ 40 శాతానికి పైగా పడిపోగా ఈ కంపెనీలోనూ రిటైలర్ల వాటా 3 శాతం వరకు పెరిగింది. స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, శ్రేయి ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌, మ్యాక్స్‌ ఇండియా, ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌, నాల్కో, నోసిల్‌లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు వాటాలు  పెంచుకోవడం గమనార్హం. You may be interested

మార్కెట్లోకి ట్రయంఫ్‌ ‘స్పీడ్‌ ట్విన్‌’

Thursday 25th April 2019

ధర రూ.9.46 లక్షలు న్యూఢిల్లీ: దిగ్గజ సూపర్‌బైక్స్‌ తయారీ కంపెనీ ట్రయంఫ్‌.. ‘స్పీడ్‌ ట్విన్‌ 2019’ ఎడిషన్‌ను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 1200–సీసీ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన ఈ సూపర్‌బైక్‌ ధర రూ.9.46 లక్షలు. ఈ సందర్భంగా సంస్థ జనరల్‌ మేనేజర్‌ షోయబ్‌ ఫరూఖ్‌ మాట్లాడుతూ.. ‘భారత రైడర్స్‌ కోసం ట్రయంఫ్‌ లగ్జరీ మోటార్‌ సైకిళ్ల పరిధి చాలా విస్తృతంగా ఉంది. మా ఉనికిని చాటుకునేలా అత్యాధునిక సూపర్‌బైక్స్‌ను ఇక్కడి మార్కెట్‌కు పరిచయం

మధ్యకాలానికి మార్కెట్లు భేష్‌: గౌతమ్‌షా

Wednesday 24th April 2019

మన ఈక్విటీ మార్కెట్లు మధ్య కాలానికి (మీడియం టర్మ్‌) చాలా బలంగా కనిపిస్తున్నాయని జేఎం ఫైనాన్షియల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌, టెక్నికల్‌ అనలిస్ట్‌ గౌతమ్‌షా అంటున్నారు. స్వల్ప కాలంలో మాత్రం నిఫ్టీ విరామంలో ఉందన్నారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. నిఫ్టీ 10,600 పాయింట్ల నుంచి 11,800 పాయింట్లకు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే చేరుకుందన్నారు.  స్వల్ప వ్యవధిలోనే 1,200 పాయింట్లు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Most from this category