STOCKS

News


ఈ నాలుగు రంగాలను పరిశీలించొచ్చు: క్యాపిటల్‌ మైండ్‌

Thursday 1st November 2018
Markets_main1541010874.png-21620

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో మధ్య కాలానికి ఫార్మా, ఐటీ, తయారీ, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు క్యాపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకుడు దీపక్‌ షెనాయ్‌ తెలిపారు. స్వల్ప కాలంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని, ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌ను మంచి ధరలకు సొంతం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘నవంబర్‌లో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కమర్షియల్‌ పేపర్లను రోలోవర్‌ చేసుకోవాల్సి ఉంది. రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నాయి. ఇరాన్‌పై ఆంక్షలు కూడా ఇదే నెలలో అమల్లోకి రానున్నాయి. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపించేవే’’ అని షెనాయ్‌ చెప్పారు. 

 

మిడ్‌క్యాప్‌లో మంచి ఐడియాలు?
కంపెనీల ఫలితాల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నామని, ఆటో యాన్సిలరీ విభాగంలో ఫలితాలు బాగున్నాయని షెనాయ్‌ తెలిపారు. ఫార్మా, ఐటీ రంగాల్లోనూ ఫలితాలు చాలా బాగున్నాయని తెలిపారు. ఈ రంగాలు టర్న్‌ అరౌండ్‌కు ఇది సంకేతంగా పేర్కొన్నారు. ఐటీ రంగంలో స్టాక్స్‌ బాగా పెరిగాయని, కరెక్షన్‌లో వాటిని కొనుగోలు చేసుకోవచ్చన్నారు. తయారీ రంగం పట్ల కూడా తాము సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇండస్ట్రియల్స్‌, ఆటో యాన్సిలరీ, కెమికల్స్‌ రంగాల్లో మంచి రికవరీ ఉన్నట్టు తెలిపారు. స్వల్ప కాలంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయన్న ఆయన... మరింత దిద్దుబాటును డిసెంబర్‌ చివరికి లేదా జనవరి నాటికి చూడొచ్చన్నారు. దీర్ఘకాలం కోసం అయితే ఈ రంగాల్లో స్టాక్స్‌ కొనుగోలుకు ఇది అనువైన సమయంగా పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలో బలమైన సంస్థలు సైతం బాగా దిద్దుబాటుకు గురైనట్టు చెప్పారు. బ్యాంకులు మళ్లీ ఎవరికి పడితే వారికి రుణాలిచ్చే పరిస్థితి లేదని, వచ్చే పదేళ్లలో తిరిగి ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం లేదని వివరించారు. కనుక స్టాక్స్‌ ఎంపికకు మంచి అవకాశం ఉందన్నారు. 

 

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ వంటి సురక్షిత రంగాల్లోనే కొనుగోళ్లు చేస్తుండడం పట్ల షెనాయ్‌ స్పందిస్తూ... అది సహజ విధానమేనన్నారు. అవి కొంత డెట్‌ ఫండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టే విషయాన్ని గుర్తు చేశారు. ‘‘కొన్ని కార్పొరేట్‌ సంస్థలు లిక్విడ్‌, అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌ నుంచి డబ్బుల్ని వెనక్కి తీసేసుకున్నాయి. అందుకే అవి ఫైనాన్షియల్స్‌కు దూరంగా ఉంటున్నాయి. రుణ సంక్షోభం అన్నది మెరుగ్గా మారే ముందు మరింత ప్రతికూలంగా మారనుంది. అయితే, బలమైన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంటూనే ఉంటాయి. స్వల్ప కాలంలో రుణ వృద్ధి కొంత తగ్గినప్పటికీ... అవి తిరిగి మళ్లీ వేగవంతమైన వృద్ధిని నమోదు చేయగలవు. మన దేశానికి ఏటా 12-14 శాతం స్థాయిలో రుణ వృద్ధి అవసరం. 70 శాతం బ్యాంకింగ్‌ వ్యవస్థ రుణాలిచ్చే పరిస్థితుల్లో లేదు. వ్యవస్థలో నమ్మకం ఏర్పడితే తిరిగి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆసక్తి పెరుగుతుంది. రుణ భారంతో ఉన్నవాటికి ప్రస్తుతం దూరంగా ఉండొచ్చు’’ అని షెనాయ్‌ వివరించారు. You may be interested

అమేజాన్‌-ఐసీఐసీఐ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు

Thursday 1st November 2018

అమేజాన్‌ సైట్లో తరచూ షాపింగ్‌ చేసే వారికి తీపివార్త... ఐసీఐసీఐ బ్యాంకుతో కలసి అమేజాన్‌ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డుతో షాపింగ్‌ చేయడం ద్వారా అదనపు ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. ఈ కార్డులో ప్రతీ రూ.1,000 కొనుగోలుపై రివార్డు పాయింట్లు లభిస్తాయి. పైగా గరిష్ట పరిమితి అంటూ లేదు. ఇవి ఎక్స్‌పైర్‌ కూడా కావు. ప్రతీ రివార్డ్‌ పాయింటు ఒక రూపాయికి సమానం.    రివార్డు పాయింట్లు అమేజాన్‌ డాట్‌ ఇన్‌లో

ఈ ఐదు షేర్లంటే అనలిస్టులకు మహా ఇష్టం

Wednesday 31st October 2018

పలు బ్రోకింగ్‌ సంస్థలు, మార్కెట్‌ విశ్లేషకులు సూచించిన 185 షేర్లలో ఒక ఐదు షేర్లు మాత్రం కామన్‌గా నిలుస్తున్నాయి. ప్రముఖ 10 మంది విశ్లేషకులు, సంస్థలు సూచించిన జాబితాలో ఈ 5 షేర్లకు స్థానం కొనసాగుతూనే ఉంటుంది. కేవలం సిఫార్సు మాత్రమే కాకుండా, కనీసం 39 శాతానికి తగ్గకుండా ఈ షేర్ల ద్వారా రాబడిని పొందవచ్చని వీరు అందరు కామన్‌గా సూచించడం మరోవిశేషం. ఇంతకీ అవేంటంటే..  కంపెనీ పేరు మొత్తం రెకమండేషన్లు బై రేటింగ్స్‌ రాబడి అంచనా

Most from this category