STOCKS

News


నాణ్యమైన షేర్లను మాత్రమే చూడండి..!

Tuesday 13th November 2018
Markets_main1542097233.png-21951

కేఆర్‌ చోక్సే సెక్యూరిటీస్‌ ఎండీ దేవేన్‌ చోక్సే వ్యాఖ్య

ముంబై: కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ అవుట్‌లుక్‌ పరంగా చూస్తే ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ కూడా బలంగానే ఉన్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయని కేఆర్‌ చోక్సే సెక్యూరిటీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేవేన్‌ చోక్సే అన్నారు. సోమవారం విడుదలైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆశాజనకంగానే ఉండగా.. జీడీపీ కూడా పర్వాలేదని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మరీ నెగటీవ్‌ అంశాలు ఏవంటే.. మార్కెట్‌ మూడ్‌ బాలేదని, ఒడిదుడుకులు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన ముడిచమురు ధరలు అధికంగా ఉండడం కూడా ఇబ్బందికర అంశమని అన్నారు. క్రూడాయిల్‌ అధికస్థాయిలో ఉన్నకారణంగానే నిఫ్టీ బాస్కెట్‌లోని కంపెనీలు ప్రభావితం అయ్యాయని వివరించారు. డిసెంబరులో అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచినట్లయితే డాలరు విలువ బలపడి రూపాయి బలహీనపడుతుందని, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలోనే ఒడిదుకులు కొనసాగుతున్నాయని విశ్లేషించారు. ఎన్‌బీఎఫ్‌సీ సంబంధిత సమస్యల కారణంగా క్రెడిట్‌ గ్రోత్‌ నెమ్మదించిందన్నారు. ఈ కారణంగా ఆటో రంగ సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. బ్యాంకుల ఎన్‌పీఏలకు ఎన్‌సీఎల్‌టీ పరిష్కార మార్గం చూపుతున్నందున ప్రభుత్వ రంగ బ్యాంకులు రికవరీ బాటపట్టాయన్నారు. జీఎస్‌టీ అమలు తరువాత సరుకు రవాణా సంస్థల షేర్లు ర్యాలీ కొనసాగిస్తాయని అందరు భావించగా.. ఇందుకు భిన్నంగా జరగడానికి కారణం ఈ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు అని వివరించారు. ఈ రంగంలో అధిక మార్జిన్లు రావడం అనేది తక్కువన్నారయన. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్‌ ట్రెండ్‌ పరంగా.. పెద్దస్థాయిలో ట్రేడింగ్‌ చేయడం ఆపేసి, నాణ్యమైన షేర్లను మాత్రమే చూడమని తమ క్లైయింట్లకు సూచిస్తున్నట్లు చెప్పారు. ఈ తరహా షేర్లు పడిపోవడాన్ని ఒక అవకాశంగా భావించి ఇప్పుడు కొనుగోలుచేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చని సూచించారు.You may be interested

సంపద సృష్టికి గొప్ప అవకాశం రాబోతోంది!!

Tuesday 13th November 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో బేర్స్‌, బుల్స్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్‌లో తొలి మూడు వారాల్లో బేర్స్‌ ఆధిపత్యం కొనసాగించాయి. తర్వాత బుల్స్‌ తిరిగి బేర్స్‌కు పంచ్‌ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. నిఫ్టీ తన గరిష్ట స్థాయి నుంచి దాదాపు 11 శాతంమేర పతనమైంది. లిక్విడిటీ సంక్షోభం, క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల, మార్కెట్‌ వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉండటం, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, ఎఫ్‌ఐఐల పెట్టుబడి ఉపసంహరణలు, రూపాయి

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌తో ఇండస్‌ఇండ్‌ ‘డీల్‌’ చెడింది..

Tuesday 13th November 2018

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తాజాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌లో 100 శాతం వాటాలను కొనుగోలు చేస్తామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌తో ఇదివరకు అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ డీల్‌కు రిజర్వు బ్యాంక్‌ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు బ్యాంక్‌ ఈ డీల్‌ నుంచి వైదొలిగింది. ‘డెఫినేటివ్‌ షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ నుంచి తప్పుకుంటున్నాం. నిర్దేశించిన కాల వ్యవధిలో డీల్‌కు సంబంధించి

Most from this category