STOCKS

News


విదేశీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి సానుకూలమే: మార్క్‌మోబియస్‌

Saturday 6th October 2018
Markets_main1538764203.png-20899

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం విదేశీ ఇన్వెస్టర్లు కలవరపరిచే అంశంగా ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు మార్క్‌ మోబియస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా పత్రికకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నవి, భారత్‌లో అదే తరహా ఇతర కంపెనీలు కూడా భారీ రుణాలపైనే నడుస్తున్నట్టు ఇన్వెస్టర్లకు తెలియజేస్తోందన్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల కెరటాల మాదిరి ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. ఇతర దేశాలు కూడా వడ్డీ రేట్లు పెంచొచ్చన్న అంచనాలను మోబియస్‌ వ్యక్తం చేశారు. ఈ తరహా చర్యలు ఇన్వెస్టర్లను మరింత ఆందోళనకు గురి చేస్తాయని చెప్పారు. 

 

‘‘ఇవన్నీ స్వల్పకాలిక పరిణామాలే. కానీ భారత్‌లో పెట్టుబడుల పెట్టే విషయంలో విదేశీ ఇన్వెస్టర్ల దీర్ఘకాలిక దృ‍క్పథం ఇప్పటికీ చాలా అధిక సానుకూలతతోనే ఉంది. అందుకే భారత్‌లో పెట్టుబడులు అన్నవి మా వెంచర్‌ పోర్ట్‌ఫోలియోలో అతి పెద్ద వాటాగా ఉంటాయి’’ అని మోబియస్‌ చెప్పారు. ఫైనాన్షియల్స్‌ రంగంలో ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలకు, బలమైన బ్యాలన్స్‌ షీట్లను కలిగిన ఎగుమతి కంపెనీలకు, చమురు ఆధారిత కంపెనీలకు మార్కెట్‌ వాటాను సొంతం చేసుకునే అవకాశం ఉందని మోబియస్‌ చెప్పారు. భారత్‌లో వడ్డీ రేట్లు ఈ ఏడాది చివరికి అర శాతం నుంచి ఒక శాతం మేర పెరిగే అవకాశం ఉందని చెప్పారు. డాలర్‌తో రూపాయి 73 వద్ద స్థిరపడొచ్చని, క్రూడాయిల్‌ మాత్రం ఈ ఏడాది చివరికి బ్యారెల్‌ 100 డాలర్లకు చేరొచ్చని, ఆ తర్వాత ఇంకా పెరిగితే 120 డాలర్లకు కూడా వెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో చమురుపై ఆధారపడేవి, బ్యాలన్స్‌ షీట్లు బలహీనంగా ఉండే కంపెనీల పట్ల తాను జాగ్రత్తగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.



You may be interested

ఇప్పుడే ఏమైంది... ముందుంది మరింత బాదుడు!

Saturday 6th October 2018

కేవలం 25 ట్రేడింగ్‌ సెషన్లలోనే సెన్సెక్స్‌ 4,600 పాయింట్లు పతనమైంది. దీన్నొక విపత్తుగా ఇన్వెస్టర్లు భావిస్తుంటే... ఓ అనలిస్ట్‌ మాత్రం వచ్చే ఆరు వారాల్లోపే అమ్మకాల సునామీ ఉందంటున్నారు. ఇందుకు ఆయన కొన్ని కారణాలు కూడా పేర్కొన్నారు. స్థూల ఆర్థిక అంశాలు, ప్రతికూల వార్తలైన చమురు ధరలు, రూపాయి పతనం, కార్పొరేట్‌ పరిణామాలకు స్పందించే గుణం మాన మార్కెట్లకు ఉంటుందని తెలిసిందే. రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న కొన్ని అంశాలు

మార్కెట్‌కు ‘‘ఆర్‌బీఐ పాలసీ’’ షాక్‌

Friday 5th October 2018

792 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 283 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ కీలక వడ్డీరేట్లపై ఆర్‌బీఐ యథాతధ పాలసీ ప్రకటనతో పాటు​ఆయిల్‌రంగ షేర్ల భారీ పతనంతో మార్కెట్‌ మూడో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 792 పాయింట్లు నష్టపోయి 34,377 వద్ద, నిఫ్టీ సూచి 283 పాయింట్ల నష్టంతో 10,316 వద్ద ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్లో నెలకొన్న అమ్మకాల పరంపరలో భాగంగా సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 964 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 337 పాయింట్లను

Most from this category