క్యూలో ఐపీఓలు
By Sakshi

ముంబై:- నిధుల సమీకరణకు పలు కంపెనీలు ఐపీఓకు రానుండటంతో ప్రైమరీ మార్కెట్లో మరోసారి సందడి నెలకొంది. ఈ వారంలో రూ.470 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ప్రైమరీ మార్కెట్‌ను తాకిన ఇర్కన్ ఐపీఓ దాదాపు 10రెట్లు ఓవర్సబ్స్క్రెబైంది. వచ్చేవారంలో రూ.1,700కోట్ల విలువైన ఆవాస్ ఫైనాన్షియర్స్ ఐపీఓ మార్కెట్లోకి రానుంది. గత ఆగస్ట్‌లో సుమారు 11 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.7వేల కోట్ల నిధుల సమీకరణకు సెబీ అనుమతులను కోరాయి. ప్రైమ్ డాటాబేస్ గణాంకాలు ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటికే 30 కంపెనీలు ఐపీఓ ఇష్యూ ద్వారా ప్రైమరీ మార్కెట్ నుంచి రూ.37,373 కోట్ల నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు దక్కించుకున్నాయి. మరో 26 కంపెనీలు రూ.35,911 కోట్ల నిధుల సమీకరణకు లక్ష్యంగా సెబీ అనుమతుల కోసం ముసాయిదా పత్రాలు ధాఖలు చేశాయి. ఇది సమయమేనా?... అధిక శాతం షేర్లు భారీగా దిద్దుబాటుకు లోనవుతున్న నేపథ్యంలో... ఇష్యూలకు ఇది సరియైన సమయం కాదని మార్కెట్ విశ్లేషకులు మాత్రం అభిప్రాయపడుతున్నారు.
- ‘‘సెన్సెక్స్ సూచీ ఇప్పుడు రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచవాణిజ్య యుద్ధ భయాలు, దేశీయ కరెన్సీ రూపాయి పతనం, కరెంట్ అకౌంట్ ద్రవ్యలోటు క్షీణించడం, రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపునకు మొగ్గుచూపడం, మరికొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగుతుండటం.. తదితర కారణాలతో వచ్చే నెలల్లో మార్కెట్లో ఒడిదుడుకులు మరింత పెరుగుతాయి’’ అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.- మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లో ఇటీవల జరుగుతున్న కరెక్షన్ కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్త వహిస్తున్నారు. ఈ ప్రభావం ఐపీఓ సబ్స్క్రిప్షన్లపై పడొచ్చు.
- మరోవైపు గోల్డ్‌మన్ శాక్స్ సెన్సెక్స్ నిఫ్టీ సూచీల ర్యాలీకి త్వరలో బ్రేక్‌లు పడుతుందని అంచనావేసింది. భారతమార్కెట్ ర్యాలీ ప్రపంచమార్కెట్ల ర్యాలీని అధిమించినట్లు తెలిపింది. దేశంలో ఆర్థికవృద్ధి మందగించడం, ఎన్నికల నిర్వహణ రానున్న సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులకు లోనవుతాయని తన నివేదికలో తెలిపింది. అలాగే ఇండియన్ మార్కెట్‌కు ‘‘బై’’ రేటింగ్ నుంచి ‘‘హోల్డ్’’ రేటింగ్‌కు సవరించింది. ఈ అంశం కూడా ఐపీఓలకు ప్రభావం చూపవచ్చు.
- ‘‘ప్రస్తుతం సెకండరీ మార్కెట్ బలహీనంగా ఉంది. రానున్న రోజుల్లో ప్రైమరీ మార్కెట్‌పై దాని ప్రభావం పడొచ్చు. గత నెలరోజులుగా అన్ని రంగాల్లో కరెక్షన్ నెలకొంది. ఈ సమయంలో నిధులు సమీకరణకు కోసం ఐపీఓలు మార్కెట్‌కు రావడం మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినట్లైతే ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవచ్చు’’ అని మార్కెట్ విశ్లేషకుడు చొక్కాలింగం అభిప్రాయపడుతున్నారు.
You may be interested
బ్యాంకులకు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ దెబ్బ తప్పదు!
Thursday 20th September 2018మూడీస్ హెచ్చరిక ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్య దేశీయ బ్యాంకులకు క్రెడిట్ నెగిటివ్అని గ్లోబల్ ఏజన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ఇన్ఫ్రా ప్రాజెక్టుల కారణంగా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ తాజాగా భారీ రుణ సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంతో కంపెనీ క్రెడిట్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. గ్రూప్‌నకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎంఎఫ్‌లు చలా నష్టాలు ఎదుర్కొంటున్నాయి. కంపెనీలో వాటాలున్న బడా
2013 సంక్షోభంతో పోలిస్తే చాలా బెటర్!
Thursday 20th September 2018భారత ఎకానమీపై జేపీ మోర్గాన్ ఐదేళ్ల క్రితం 2013లో తలెత్తిన కరెన్సీ సంక్షోభం, వాణిజ్య మందగమన పరిస్థితులతో పోలిస్తే భారత ఎకానమీ ప్రస్తుతం చాలా బాగుందని, గడ్డుపరిస్థితులను తట్టుకునే స్థితిలో ఉందని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. వివిధ అంశాలపై సంస్థ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. - ట్రేడ్‌వార్: వాణిజ్యయుద్ధ భయాలున్నా సేవలు, ఉత్పత్తుల రంగంలో అంతర్గతంగా వృద్ధి ఊపందుకుంటోంది. సాగు రంగంలో అనూహ్య ఉత్పత్తితో రూరల్ ఆదాయాలు గణనీయంగా పెరగడం