STOCKS

News


స్పందన స్ఫూర్తి రూ.360కోట్ల నిధుల సమీకరణ

Saturday 3rd August 2019
Markets_main1564822236.png-27524

యాంక‌ర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపుల ద్వారా రూ.360.28 కోట్లను స‌మీక‌రించిన‌ట్లు స్పందన స్ఫూర్తి కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 42లక్షల ఈక్విటీ షేర్లను అప్పర్‌ ప్రైజ్‌ బాండ్‌ రూ.856 వద్ద కేటాయింపు ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. వెల్స్‌ ఫార్గో ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఈక్వటీ ఫండ్స్‌, ఫ్లోరిడా రిటైర్‌మెంట్‌ సిస్టమ్స్‌, బజాజ్‌ అలియన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సహా మరో 15 యాంకర్‌ ఇన్వెస్టింగ్‌ సంస్థల నుంచి ఈ పెట్టుబడులను సమీకరించినట్లు కంపెనీ పేర్కోంది. 
సోమవారం నుంచి స్పందన స్ఫూర్తి ఐపీఓ:-
ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఏర్పాటైన మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ స్పందన స్ఫూర్తి పబ్లిక్‌ ఇష్యూ ఆగస్ట్‌ 5న(సోమవారం) ప్రారంభం కానుంది. ఇదే నెల 7న ముగియనున్న ఈ ఐపీఓ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.1200 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తుంది. షేరు ధరల శ్రేణి రూ.853-856గా నిర్ణయించింది. యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సంస్థకు లీడ్‌ మేజనర్లుగా వ్యవహరించనున్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మూలధన పెంపునకు, కార్పోరేట్‌ అవసరాలకు వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ నెల 19న కంపెనీ ఎక్చ్సేంజీల్లో కంపెనీ షేర్లు లిస్ట్‌ కానున్నాయి. You may be interested

డిసెంబర్‌కల్లా 10,300 స్థాయికి నిఫ్టీ!

Saturday 3rd August 2019

కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులలో 1 శాతం రిస్క్‌ మాత్రమే తీసుకోండి మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు బేర్‌ మార్కెట్లో కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నాయని సామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. 12,000 మార్కు ఇక కలే!  బడ్జెట్‌ తర్వాత నుంచి మార్కెట్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పటి వరకు బీఎస్‌ఈలో ఏకంగా రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ముందుకు

ఫ్రంట్‌లైన్ స్టాక్‌లే బెటర్‌ ఛాయిస్‌!

Saturday 3rd August 2019

దీర్ఘకాలానికి బీమా, సిటీ గ్యాస్‌ డిస్ట్రీబ్యూషన్‌ సెక్టార్స్‌..  హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ కవలలు దిద్దుబాటుకు గురైతే వాటిని కొనుగోలు చేయవచ్చు ‘చాలా పెద్ద క్యాప్‌లు నెమ్మదిగా మిడ్‌క్యాప్‌లుగా మారుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఫ్రంట్‌లైన్ స్టాక్‌లకు కట్టుబడి ఉండడమే ఉత్తమం. మిడ్‌ క్యాప్‌లపై బుల్లిష్‌గా ఉంటే వీటిపై దృష్ఠి పెట్టవచ్చు.’ అని సెంట్రమ్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , రీసెర్చ్ హెడ్ జగన్నాధం తునుగుంట్ల ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు.

Most from this category