News


నిఫ్టీ 9,500లకు వస్తే కొనేయండి..

Tuesday 6th November 2018
Markets_main1541493529.png-21757

లిక్విడిటీ సమస్యలు, రాజకీయ అస్థిరతల కారణంగా నిఫ్టీ-50 ఇండెక్స్‌ 9,500 స్థాయికి పడిపోతే అప్పుడు కళ్లు మూసుకొని స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని మార్కెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. 9,500 స్థాయిలో రాజకీయ పరిస్థితులు, క్రూడ్‌ ధరల వంటి ఇతర అంశాల గురించి ఆలోచించాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కాగా నిఫ్టీ గత రెండు నెలల కాలంలో దాదాపు 10 శాతానికిపైగా పడిపోయి మళ్లీ రీబౌండ్‌ అయ్యింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రీపేమెంట్‌ డిఫాల్ట్‌, లిక్విడిటీ సంక్షోభం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. 

వివిధ రంగాల స్టాక్స్‌పై సౌరభ్‌ ఏమన్నారంటే..

టెక్నాలజీ 
♦ రూపాయి క్షీణత వల్ల ప్రయోజనం లభిస్తుంది.
♦ క్యూ2 ఆర్థిక ఫలితాలు, విక్రయాల పెరుగుదల వల్ల ఐటీ రంగానికి మేలు కలుగుతుంది.
♦ దాదాపు 10 శాతం స్థిర కరెన్సీ వృద్ధి, ఈపీఎస్‌లో 15 శాతం వృద్ధి వంటి అంశాల ఆధారంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవాలి. 
♦ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, రూపాయి క్షీణత కారణంగా ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ వంటి నాణ్యమైన మిడ్‌ క్యాప్‌ ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

రియల్‌ ఎస్టేట్‌
♦ జీఎస్‌టీ, రెరా అమలు వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్థిరీకరణ చోటుచేసుకుంటుంది.
♦ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి ఫండింగ్‌ తగ్గుదల నేపథ్యంలో ఇన్వెస్ట్‌ చేయడానికి 3-6 నెలలు వేచి ఉండండి.
♦ వచ్చే 6 నెలల కాలంలో దక్షిణ భారతదేశంలో రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని ధరల్లో మార్పు రావొచ్చు.

♦ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. 



You may be interested

5నెలల కనిష్టానికి సిప్లా

Tuesday 6th November 2018

ఔషధ రంగ దిగ్గజం సిప్లా షేరు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 5నెలల కనిష్టానికి చేరుకుంది. సిప్లా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ విశ్లేషకులు ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయలేకపోయింది. దీంతో పాటు సిటీ, హెచ్‌ఎస్‌బీసీ,  క్రెడిట్‌ శాచ్స్‌ వంటి బ్రోకరేజ్‌ సంస్థలు సిప్లా షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో షేరు నష్టాల బాట పట్టింది. పలితంగా నేడు షేరు

టాటా మోటర్స్‌ ర్యాలీ

Tuesday 6th November 2018

అక్టోబర్‌ నెలలో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలు దాని మాతృ సంస్థ టాటామోటర్స్‌ షేరుకు జోష్‌నిచ్చాయి. ఫలితంగా టాటామోటర్స్‌ షేరు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 5శాతం లాభపడింది. నేడు టటా మోటర్స్‌ షేరు రూ.192ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అక్టోబర్‌లో జాగ్వార్‌ లేండ్‌రోవర్‌ అమ్మకాలు ఇది 32శాతం వృద్ధి చెంది 6942 యూనిట్లకు పెరిగినట్లు టాటామోటర్స్‌ ప్రకటించింది. గత సెప్టెంబర్‌లో అమ్మకాలు 5270 యూనిట్ల మాత్రమే నమోదయ్యాయి. జాగ్వార్‌ వాహన అమ్మకాలు

Most from this category