STOCKS

News


అర్‌వింద్‌ ఫ్యాషన్స్‌ లిస్టింగ్‌

Saturday 9th March 2019
Markets_main1552117853.png-24511

అర్‌వింద్‌ ఫ్యాషన్స్‌ లిస్టింగ్‌
5 శాతం లాభంతో రూ.621 వద్ద ముగింపు 

న్యూఢిల్లీ: అర్‌వింద్ కంపెనీ నుంచి విడివడిన(డీమెర్జ్‌ అయిన) అర్వింద్‌ ఫ్యాషన్స్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం లిస్ట్‌ అయింది. లాల్‌భాయ్‌ గ్రూప్‌నకు చెందిన ఈ దుస్తులు, యాక్సెసరీల కంపెనీ రూ.592 వద్ద స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.621 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,603 కోట్లుగా నమోదైంది. అంతర్జాతీయ బ్రాండ్లు-టామీ హిల్‌ఫిగర్‌, కాల్విన్‌ క్లెయిన్‌, యూస్‌ పోలో, అసోసియేషన్‌, యారో తదితర అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులను ఈకంపెనీ విక్రయిస్తోంది. ఈ కంపెనీ అన్‌లిమిటెడ్‌ పేరుతో దుస్తుల రిటైల్‌ చెయిన్‌ను,  సెఫోరా పేర్లతో సౌందర్య ఉత్పత్తుల విక్రయాలను నిర్వహిస్తోంది. 

అర్వింద్‌ కంపెనీ.. బ్రాండెడ్‌ దుస్తుల వ్యాపారాన్ని అర్వింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో, ఇంజినీరింగ్‌ విభాగాన్ని అనుప్‌ ఇంజినీరింగ్‌ పేరుతో డీమెర్జ్‌ చేసింది. ఈ నెల 1న అనుప్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. 

ఫెయిర్‌ వేల్యూ నిర్ణయంలో గందరగోళం..
కొత్తగా ఒక కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్ట్‌ అయ్యేటప్పుడు స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు ‘ప్రి-ఓపెన్‌ యూజింగ్‌ కాల్‌ ఆక్షన్‌’ను నిర్వహిస్తాయి. 45 నిమిషాల పాటు జరిగే ఈ ధర అన్వేషణ ప్రక్రియలో ఇన్వెస్టర్లు ఎంత ధరకు ఈ షేర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో బిడ్‌లు దాఖలు చేస్తారు. ఎక్కువ మంది బిడ్‌ చేసిన ధరను ప్రారంభ ధరగా నిర్ణయిస్తారు. ఈ కంపెనీ ప్రారంభ ధరను స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు రూ.590గా నిర్ణయించాయి.  కాగా అర్వింద్‌ ఫ్యాషన్స్‌ షేర్‌కు సరైన విలువ(ఫెయిర్‌ వేల్యూ) నిర్ణయంలో కొంత గందరగోళం నెలకొన్నది. ఈ కంపెనీ ఫెయిర్‌ వేల్యూ రూ.900 నుంచి రూ.1,300 రేంజ్‌లో ఉండగలదని అంచనాలున్నాయి. అయితే ధర అన్వేషణ ప్రక్రియలో లోపాల వల్ల ఫెయిర్‌ వేల్యూ చాలా తక్కువగా రూ.331గా నిర్ణయమైందని బ్రోకరేజ్‌ సంస్థలు అంటున్నాయి. ఫెయిర్‌ వేల్యూ మరింత ఎక్కువగా ఉండాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. ఫెయిర్‌ వేల్యూ రూ.1,400 గా ఉండాలని యాక్సిస్‌ క్యాపిటల్‌ పేర్కొంది. ఈ విషయమై కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు ఫిర్యాదు చేసింది. 



You may be interested

50 లక్షల షేర్లు విక్రయించిన గ్రాన్యూల్స్‌ ప్రమోటర్లు

Saturday 9th March 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం 6.79 శాతం పెరిగి రూ.110.85 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.114.30 వరకు వెళ్లింది. రూ.50 కోట్ల నిధులను సమకూర్చుకోవడానికి 0.20 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను బ్లాక్‌ డీల్‌లో పలువురు ఇన్వెస్టర్లకు కంపెనీ విక్రయించింది. దీంతోపాటు సుమారు రూ.50 కోట్ల విలువైన వ్యక్తిగత

ఫేమ్‌-2 పథకాన్ని నోటిఫై చేసిన కేంద్రం

Saturday 9th March 2019

ఏప్రిల్‌ నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ఫేమ్‌-2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు ధరపై వినియోగదారులకు సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం కింద రూ.10,000 కోట్లను కేంద్రం కేటాయించింది. ‘‘దేశంలో ఎలక్ట్రిక్‌ రవాణాను వేగంగా అమల్లోకి తీసుకురావడంతోపాటు, తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం, 2019 ఏప్రిల్‌ 1 నుంచి మూడేళ్ల కాలానికి

Most from this category