STOCKS

News


బ్యాంకులకు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ దెబ్బ తప్పదు!

Thursday 20th September 2018
Markets_main1537440462.png-20414

మూడీస్‌ హెచ్చరిక
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్య దేశీయ బ్యాంకులకు క్రెడిట్‌ నెగిటివ్‌అని గ్లోబల్‌ ఏజన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ హెచ్చరించింది. ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల కారణంగా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థ తాజాగా భారీ రుణ సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంతో కంపెనీ క్రెడిట్‌ రేటింగ్‌ దారుణంగా పడిపోయింది. గ్రూప్‌నకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎంఎఫ్‌లు చలా నష్టాలు ఎదుర్కొంటున్నాయి. కంపెనీలో వాటాలున్న బడా సంస్థలన్నీ ఇప్పడు ఇక్కట్లలో పడ్డాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ దెబ్బ ఇక్కడతో ఆగదని, బ్యాంకులపై తప్పక పడుతుందని మూడీస్‌ అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు చెందిన రోడ్డు ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలను ఎన్‌పీఏలుగా గుర్తించడం జరగలేదని తెలిపింది. మాతృ సంస్థ ఈ ప్రాజెక్టులను ఆదుకుంటుందన్న అభిప్రాయం ఉండేదని తెలిపింది. అయితే మాతృసంస్థ ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్య కారణంగా బ్యాంకులకు నష్టాలు తప్పకపోవచ్చని పేర్కొంది. కాకపోతే బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో ఈ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల వాటా తక్కువగా ఉండడమే కాస్త ఊరటనిచ్చే అంశమని తెలిపింది. ఇప్పట్లో కంపెనీ కోలుకునే ఛాన్సులు తక్కువని, రీపేమెంట్‌ ఆలస్యం కావచ్చని అంచనా వేసింది. తాజా సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు కంపెనీ తన ఆస్తులను అమ్మేందుకు యత్నిస్తోంది. దీంతో పాటు రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలని సైతం భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీపై ఆర్‌బీఐ స్పెషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తోంది. 



You may be interested

మూడు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ మక్కువ

Thursday 20th September 2018

ఎస్‌బీఐ, అపోలో హాస్పిటల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్‌ షేర్లపై దృష్టి పెట్టామని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ వెల్లడించింది. ఇప్పటివరకు పోర్టుఫోలియోలో ఉన్న ఇన్ఫోసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హావెల్స్‌ స్థానంలో ఈ మూడింటిని తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా ఎంచుకున్న మూడు స్టాకులు ఈ ఏడాది పేలవ ప్రదర్శన చూపడం గమనార్హం. కానీ మోర్గాన్‌స్టాన్లీ వీటిపై ఓవర్‌వెయిట్‌ ధృక్పథంతో ఉన్నట్లు తెలిపింది. ఎంపికకు కారణాలు.. 1. ఎస్‌బీఐ: ప్రభుత్వం చేపట్టిన రీక్యాప్‌ పథకంతో

క్యూలో ఐపీఓలు

Thursday 20th September 2018

ముంబై:- నిధుల సమీకరణకు పలు కంపెనీలు ఐపీఓకు రానుండటంతో ప్రైమరీ మార్కెట్‌లో మరోసారి సందడి నెలకొంది. ఈ వారంలో రూ.470 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ప్రైమరీ మార్కెట్‌ను తాకిన ఇర్కన్‌ ఐపీఓ దాదాపు 10రెట్లు ఓవర్‌సబ్‌స్క్రెబైంది. వచ్చేవారంలో రూ.1,700కోట్ల విలువైన ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ ఐపీఓ మార్కెట్‌లోకి రానుంది. గత ఆగస్ట్‌లో సుమారు 11 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.7వేల కోట్ల నిధుల సమీకరణకు సెబీ అనుమతులను కోరాయి.  ప్రైమ్‌ డాటాబేస్‌ గణాంకాలు

Most from this category