STOCKS

News


ఎల్‌ఐసీ వాటా పెంచుకున్న స్టాక్స్‌ ఇవే..

Wednesday 29th August 2018
Markets_main1535523329.png-19756

దేశీ అతిపెద్ద ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) గత ఏడాది కాలంలో పలు స్టాక్స్‌లో వాటాలను పెంచుకుంది. ఏసియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, క్యాస్ట్రోల్‌ ఇండియా, క్రిసిల్‌, హిందుస్తాన​ యూనిలివర్‌, ఇక్రా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, పీఅండ్‌జీ హైజెనీ అండ్‌ హెల్త్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ స్టాక్స్‌లో ఎల్‌ఐసీ వాటాలు పెంచుకుంది. ఈ జాబితాలోని చాలా స్టాక్స్‌ వాటి పరిశ్రమ సగటుతో పోలిస్తే ఎక్కువ వృద్ధి రేటునే నమోదు చేశాయి. ఈ స్టాక్స్‌పై నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.. 
‘ఇన్వెస్టర్లు వారి ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో స్వతంత్రంగా వ్యవహరించాలి. ఏ దేశీ/విదేశీ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ను అనుసరించకూడదు. పైన పేర్కొన్న స్టాక్స్‌లో ఏసియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, పీఅండ్‌జీ రక్షణాత్మక కాంపౌండింగ్‌ షేర్లు. ఈ షేర్లు పడిపోయేటప్పుడు కొనుగోలు చేయవచ్చు’ అని బొనాంజా పోర్ట్‌ఫోలియో ఫండ్‌ మేనేజర్‌ ప్రీతమ్‌ డ్యూస్కర్‌ పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో పది స్టాక్స్‌లో ఏడు వరకు మంచి రిటర్న్స్‌ను అందించాయని తెలిపారు. బ్రిటానియా 55 శాతం ర్యాలీ చేసింది. ఇక హిందుస్తాన్‌ యూనిలివర్‌ 51 శాతం, ఏసియన్‌ పెయింట్స్‌23 శాతం ర్యాలీ చేశాయి. అయితే ఇక్రా, క్రిసిల్‌, క్యాస్ట్రోల్‌ ఇండియా స్టాక్స్‌ పడిపోయాయి. ఇవి గత ఏడాది కాలంలో 18 శాతం వరకు నెగటివ్‌ రిటర్న్స్‌ను అందించాయి. 
‘పైన పేర్కొన్న పది స్టాక్స్‌లో చాలా వరకు నిలకడగా పెరుగుతూ వస్తున్నాయి. గత 5-6 క్వార్టర్లలో ఇవి పరిశ్రమ సగటు కన్నా ఎక్కువ వృద్ధి రేటును సాధించాయి. నిర్వహణ సామర్థ్యం మెరుగుదల వల్ల మార్జిన్లను పెంచుకున్నాయి’ అని ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ అతిష్‌ మట్లేవాలా తెలిపారు. వచ్చే 4-6 త్రైమాసికాల్లోనూ ఈ కంపెనీలు బలమైన వృద్ధి రేటు సాధిస్తాయని, వచ్చే రెండేళ్లలో మంచి రిటర్న్స్‌ అందిస్తాయని పేర్కొన్నారు. 
జూన్‌ క్వార్టర్‌ డేటాను పరిశీలిస్తే ఎల్‌ఐసీ దాదాపు 32 స్టాక్స్‌లో వాటాను కలిగి ఉంది. వీటిల్లో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టీసీఎం, సింప్లెక్స్‌ రియల్టీ, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, ఐటీసీ, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఏసీసీ, క్యాస్ట్రోల్‌ ఇండియా కూడా వీటిల్లో ఉన్నాయి. పనితీరు ఆధారంగా చూస్తే 2018లో వీటిల్లో చాలా స్టాక్స్‌ ఆశాజనక రిటర్న్స్‌ అందించలేదు. అందువల్ల ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీ పోర్ట్‌ఫోలియోను గుడ్డిగా అనుసరించొద్దని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘చాలా కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు కంపెనీ సంబంధిత అన్ని వివరాలను నిశితంగా గమనించాలి. దీర్ఘకాలానికి ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. బ్యాంక్‌ కష్టకాలం ముగిసింది. వచ్చే 4-6 క్వార్టర్లలో ఇది మంచి పనితీరు కనబరుస్తుంది’ అని మట్లేవాలా పేర్కొన్నారు. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సిఫార్సు చేస్తోంది. ఏదో ఒక ఇన్‌స్టిట్యూషన్‌ వివిధ స్టాక్స్‌లో ఇన్వె‍స్ట్‌ చేస్తోందని మీరు కూడా వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయవద్దని పేర్కొంది. You may be interested

40 షేర్లు.. 52వారాల కనిష్టానికి...

Wednesday 29th August 2018

ముంబై:- ఆసియా మార్కెట్ల నుంచి అందతున్న మిశ్రమ ఫలితాల నేపథ్యంలో బుధవారం ఉదయం దేశీయ మార్కెట్‌ పరిమిత శ్రేణిలో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.11:30ని.లకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 38898 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్పనష్టంతో 11,734 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మార్కెట్‌ బడిదుడుకుల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో 40 షేర్లు 52-వారాల కనిష్టానికి పతనయ్యాయి. వాటిలో కామ్లిన్‌ ఫిన్‌ సైన్సెన్స్‌, ధనలక్ష్మీ బ్యాంకు, ఈ-క్లారెక్స్‌ సర్వీసెస్‌,

సెన్సెక్స్‌@ 40,000.. నిఫ్టీ@ 12,700..!

Wednesday 29th August 2018

జేఎం ఫైనాన్షియల్స్‌ అంచనా తాజాగా మార్కెట్లో జరుగుతున్న ర్యాలీ కారణంగా సూచీలు ఓవర్‌బాట్‌జోన్‌కు చేరాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతమ్‌ షా మాత్రం సూచీలు ఇంకా ఓవర్‌బాట్‌ కాలేదని, మరింత పెరిగేందుకే ఆస్కారం ఉందని అభిప్రాయపడుతున్నారు. త్వరలో సెన్సెక్స్‌ 40వేల పాయింట్లను, నిఫ్టీ 12700 పాయింట్లను చేరతాయని బల్లగుద్ది చెబుతున్నారు. ఆరునెలల్లో సూచీలు ఈ స్థాయిలను చేరతాయన్నారు. యూఎస్‌, చైనా వాణిజ్యయుద్ధ భయాల కారణంగా

Most from this category