STOCKS

News


సెన్సెక్స్‌ లాభం 305 పాయింట్లు

Tuesday 10th July 2018
Markets_main1531219758.png-18173

3శాతం ర్యాలీ చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీస్‌, అటో, ఆర్థిక రంగ షేర్ల అండతో మార్కెట్‌ మంగళవారం మూడోరోజూ లాభాలతో ముగిసింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల అంశాలు లేకపోవడంతో సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ ఆద్యంతం పటిష్టమైన ర్యాలీని చేశాయి. ట్రేడింగ్‌ చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో ఇంట్రాడేలో హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌ ద్వయం, ఐటీసీ షేర్లు లాభపడటం సానుకూల ప్రభావాన్ని చూపాయి. చివరికి మార్కెట్‌ ముగిసే సమయానికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 305 పాయింట్లు లాభంతో 36,240 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,947 వద్ద ముగిశాయి.
సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల పైన ప్రారంభం:-
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్‌ లాభాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 10,903 వద్ద, సెన్సెక్స్‌ 133 పాయింట్లు లాభపడి 36068 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీల ఆరంభ ఉత్సాహానికి హెవీ వెయిట్‌ షేర్ల ర్యాలీ మరింత ఊపునిచ్చింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మిడ్‌సెషన్‌ సమయంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత వహించారు. అయితే యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభంతో అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపడినట్లైంది. ఫలితంగా చివరిగంటంలో ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్‌ 305 పాయింట్లు పెరిగి 36,240 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,947 వద్ద స్థిరపడింది.
కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 1నుంచి 2శాతం నష్టపోగా, ఎస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందాల్కో, గెయిల్‌ షేర్లు 3నుంచి 5శాతం లాభపడ్డాయి.



You may be interested

మైండ్‌ట్రీ కొనొచ్చు- ఆనంద్ రాఠీ

Tuesday 10th July 2018

కంపెనీ: మైండ్‌ట్రీ లిమిటెడ్‌ సిఫార్సు: ఆనంద్ రాఠీ రీసెర్చ్‌ ప్రస్తుత ధర: రూ.1,038 (జులై 10, 2018న) టార్గెట్‌ ధర: రూ.1088 రెకమండేషన్‌: కొనొచ్చు కొనుగోలు శ్రేణి: రూ.1037-1047 స్టాప్‌లాస్‌: రూ.1019 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.191 /105 ఈ షేరు స్వల్పకాలిక సగటు కదలికల స్థాయి ఎగువకు చేరుకుని సానుకూల సంకేతం ఇచ్చిందని ఆనంద్ రాఠీ విశ్లేషించింది. కీలక ట్రెండ్‌ పాజిటీవ్‌గా ఉన్నందు వల్ల రూ.1019 వద్ద స్టాప్‌ లాస్‌ నిర్వహిస్తూ.. రూ.1037-1047 స్థాయిలో షేరును కొనుగోలుచేయవచ్చని

ఆటో రంగ షేర్లపై హెచ్‌డీఎఫ్‌సీ విశ్లేషణ

Tuesday 10th July 2018

గ్రామీణ ప్రాంతం నుంచి డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఆటో, ఆటో విడిభాగాల కంపెనీల క్యూ1 ఫలితాలు ఆకర్షణీయంగా ఉండనుండాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనావేసింది. బీఎస్‌ ఫైవ్‌, వస్తు సేవల పన్ను అమలు అనంతరం నూతన వాహనాల విడుదల ఆధారంగా అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, లూమాక్స్‌ ఆటో, జేబీఎమ్‌ ఆటో, జామ్నా ఆటో కంపెనీల షేర్లును సూచించింది. ఈ షేర్లు తమ టాప్‌ పిక్స్‌గా ఉన్నాయని వెల్లడించింది.

Most from this category