STOCKS

News


కొనసాగిన నష్టాలు

Wednesday 5th September 2018
Markets_main1536144037.png-19985

మార్కెట్‌ నష్టాల పరంపర ఆగడం లేదు. రూపాయి వరుసగా ఆరోరోజూ కొత్త కనిష్టాలకు పతనం కావడం, బాండ్‌ఈల్డ్స్‌ 4ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూలాంశాలు ఇందుకు కారణమయ్యాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంజీసీ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిశాయి.  సెన్సెక్స్‌ 140 పాయింట్ల నష్టంతో 38,018 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 11,477 వద్ద ముగిశాయి. ఓ దశలో నిఫ్టీ సూచీ 126 పాయింట్లు, సెన్సెక్స్‌ 384 పాయింట్లు నష్టపోయాయి. అయితే చివర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి(37774) నుంచి 250 పాయింట్లు, నిఫ్టీ ఇంట్రాడే కనిష్టస్థాయి(11,394)నుంచి 70 పాయింట్లు వరకు రీకవరీ అయ్యాయి. ఇంట్రాడేలో 37774 - 38250 రేంజ్‌ (మొత్తం 486 పాయింట్లు)లో కదలాడింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ ఇంట్రాడేలో 11,394 - 11,543 (మొత్తం 149 ఊ పాయింట్ల) రేంజ్‌లో కదలాడింది. రూపాయి కొత్త కనిష్టాలకు పతనం కావడంతో ఎగుమతులపై ఆధారపడే ఫార్మా షేర్లు 1శాతం లాభపడ్డాయి. వాటితో పాటు మెటల్‌, అటో షేర్లు లాభాల్లో ముగిశాయి. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 58 పాయింట్ల నష్టపోయి 27,376 వద్ద ముగిసింది.
కోటక్‌ బ్యాంకు, టైటాన్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, జీలిమిటెడ్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1.50శాతం నష్టపోగా, వేదాంత, హిందాల్కో, విప్రో టాటామోటర్స్‌, యస్‌ బ్యాంకు షేర్లు 2నుంచి 3శాతం లాభపడ్డాయి.



You may be interested

పిరమల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌ సత్తా ఉన్న స్టాక్స్‌

Wednesday 5th September 2018

దీర్ఘకాల ఇన్వెస్టర్లకు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పెట్టుబడులపై నష్టాలొచ్చే అవకాశం లేదని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, ఇండిపెండెంట్‌ అడ్వైజర్‌ వివేక్‌ మవానీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అనలిస్టులకు పలు కంపెనీలు తమ భవిష్యత్తు ప్రణాళికలను దృశ్యరూపకంగా వివరించాయి. వాటిల్లో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ గురించి మవానీ తెలియజేశారు.    పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ భవిష్యత్తు వృద్ధి

సెప్టెంబర్‌ బేర్స్‌దే!?

Wednesday 5th September 2018

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆగస్ట్‌లో 1,000 పాయింట్లమేర పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే ఇండెక్స్‌ 14 శాతానికిపైగా ఎగసింది. అంటే దాదాపు 5,000 పాయింట్లు ర్యాలీ చేసింది. ఇలాంటప్పుడు ఇన్వెస్టర్ల మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అదే ర్యాలీ ఈ నెలలోనూ కొనసాగతుందా? లేదా? అని. చరిత్రను విశ్లేషిస్తే.. స్టాక్‌ మార్కెట్‌లో గత పదేళ్లలో సెప్టెంబర్‌ నెలల్లో ఐదు సార్లు బేర్స్‌ ఆధిపత్యం కనబరిచారు. సెన్సెక్స్‌ 2008 సెప్టెంబర్‌లో

Most from this category