News


డబ్బు ఒక్కటే కాదు.. ధైర్యం కావాలి..!

Monday 5th November 2018
Markets_main1541407717.png-21722

  • ప్రముఖ వాల్యూ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా వ్యాఖ్య

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌లో సంపాదించాలి అంటే.. కేవలం పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదని, అందుకు సరిపడా గుండె ధైర్యం కూడా అవసరమని ప్రముఖ వాల్యూ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా వ్యాఖ్యానించారు. దీపావళి పండుగ సందర్భంగా ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. మార్కెట్‌ పని చేసే విధానాన్ని అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే ఇక్కడ సంపాదించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘దలాల్‌ స్ట్రీట్‌లో డబ్బు సంపాదించాలి అంటే మార్కెట్‌లో ఉండే లోటుపాట్లను అర్థంచేసుకోవాలి. భారీ మొత్తంలో డబ్బు ఉన్నంత మాత్రన సంపాదించేస్తారనే గ్యారంటీ ఇక్కడ లేదు. అంత మొత్తంలో ఉన్నప్పటికీ.. ఉన్నదంత ఊడ్చిపెట్టుకుపోయే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. నష్టాలను తట్టుకోగలిగే గుండె ధైర్యం కూడా కావాలి.’ అని అన్నారు. ఈ వ్యాపారంలో నష్టాలను తట్టుకుని ఎదురు నిలబడగలిగే దమ్ము ఉంటేనే సంపాదన చూడగలరు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ సమయంలో ఇది నిరూపితమైందన్న విషయం తెలిందే అన్నారు. వార్తల ఆధారంగా మన పెట్టుబడులు భారీ సంపదను సృష్టించగలవనే అంశాన్ని ఆయన బాగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఇందుకు తన జీవితంలో జరిగిన సంఘటన గురించి వివరించారయన. 1990లో మొదటిసారిగా పంజాబ్‌ ట్రాక్టర్స్‌ షేరును కొనుగోలు చేశానని, ఈ వ్యాపార విభాగంలో టర్న్‌అరౌండ్‌ జరుగుతుందనే వార్త తన పెట్టుబడిని ఏకంగా 4-5 రెట్లు పెంచిందని వెల్లడించారు. ఈ షేరులో తన 10 ఏళ్ల సంపదైన రూ.35,000 పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. వచ్చిన సంపదతో మళ్లీ ఏసీసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈస్థాయి వరకు చేరుకోగలిగానని ఆయన వివరించారు. 14 ఏళ్ల వయస్సులో తన తాతయ్యతో కలిసి కోల్‌కత్త స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి వెళ్లేవాడినని వివరించిన ఆయన.. ఆ వయస్సు నుంచే మార్కెట్‌ పెట్టుబడి మెళకువలు నేర్చుకున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘ కష్టనష్టాల తరువాత మాత్రమే ఈస్థాయికి చేరుకోగలిగానని తెలిపారు. నాణ్యమైన యాజమాన్యం కలిగిన షేర్లను మాత్రమే కొనుగోలుచేయడం మంచిదని ఈ సందర్భంగా ఆయన ఫండమెంటల్‌ ఇన్వెస్టర్లకు సూచించారు. ముందుగా మంచి యాజమాన్యం అనే భ్రమ కల్పించినప్పటికీ.. ఆ తరువాత పరిస్థితులు మారిపోయే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన షేరుపట్ల అప్‌డేట్‌గా ఉండాలన్నారు. మన్‌పసంద్‌, పీసీజే ఇందుకు ఉదాహరణగా తెలిపారు. You may be interested

గెయిల్‌ లాభం 55% జంప్‌

Monday 5th November 2018

గెయిల్‌ ఇండియా తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 55 శాతం వృద్ధితో రూ.1,963 కోట్లకు ఎగసింది. మంచి నిర్వహణ పనితీరు ఇందుకు కారణం. మార్కెట్‌ నిపుణులు కంపెనీ నికర లాభం రూ.1,473 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. అంటే కంపెనీ నికర లాభం అంచనాలు మించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం ఇదే

బంగారం కన్నా ఈక్విటీ ముద్దు..

Monday 5th November 2018

దీపావళి వచ్చేసింది. మరీముఖ్యంగా ధంతేరాస్‌ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే పసడి కన్నా ఈక్విటీల్లో ఇన్వె‍స్ట్‌ చేయడం మంచిదని సూచిస్తున్నారు ఫండ్‌ మేనేజర్లు.  కోటక్‌ మహీంద్రా ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ షా మాట్లాడుతూ.. బంగారం కొనుగోలును ప్రోత్సహించనని, భారత్‌లో ప్రజలు అవసరమైన దాని కన్నా ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. గత దీపావళికి ఈక్విటీలు ఎలాంటి రిటర్న్స్‌ అందించలేదని, అవి ఇప్పుడు చౌక ధరకు

Most from this category